Top
Batukamma

హాట్ బ్యూటీనే కావాలంటున్న అల్లు అర్జున్, మహేష్ బాబు..!

హాట్ బ్యూటీనే కావాలంటున్న అల్లు అర్జున్, మహేష్ బాబు..!
X
Highlights

సోషల్ మీడియాలో హాటెస్ట్ నటిగా పేరున్న ఊర్వశి రౌటేలా తో ఐటం సాంగ్ చేయించబోతున్నారట.

Urvashi Rautela : అల్లు అర్జున్ నెక్ట్స్ మూవీ పుష్ప షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అల్లు అర్జున్ హీరోగా సుకుమార్(sukumar) డైరెక్షన్ లో ఈ మూవీ వస్తోంది. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ మూవీ ఫస్ట్ లుక్.. ఫ్యాన్స్ లో అంచనాల్ని పెంచేసింది.

ఈ సినిమాలో రష్మిక హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే ఫుల్ ఫాంలో ఉన్న రష్మిక(Rashmika mandanna).. ఈ మూవీతో ప్రేక్షకులను మరింత ఆకట్టుకోనుంది.

ఇక.. పుష్ప మూవీకి సంబంధించి మరో లెటెస్ట్ అప్డేట్ వచ్చింది. ఈ సినిమాలో ఐటం సాంగ్ కి బాలీవుడ్ హాట్ బ్యూటీని ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. సోషల్ మీడియాలో హాటెస్ట్ నటిగా పేరున్న ఊర్వశి రౌటేలా(Urvashi Rautela)తో ఐటం సాంగ్ చేయించబోతున్నారట.

అంతేకాదు.. మహేష్ బాబు హీరోగా వస్తున్న సర్కారు వారి పాట.. సినిమాలోనూ ఈ బ్యూటీతో ఐటం నంబర్ చేయించే ఆలోచనలో ఉన్నారట.

ఇప్పటికే బ్లాక్ రోస్ అనే మూవీతో తెలుగులో తన సత్తా చాటింది ఈ బ్యూటీ. ఇప్పుడు స్టార్ హీరోలతో అందాల విందు ఏ స్థాయిలో ఉంటుందో చూడాలి.



























Next Story
Share it