Top
Batukamma

మళ్ళీ ప్రేమలో పడ్డా.. నాలుగో పెళ్ళికి రెడీ అంటున్న హీరోయిన్!

మళ్ళీ ప్రేమలో పడ్డా.. నాలుగో పెళ్ళికి రెడీ అంటున్న హీరోయిన్!
X
Highlights

ఇక పీటర్ పాల్‌ ను ఈ ఏడాది జూన్ 27 న చెన్నైలో ముచ్చటగా మూడో వివాహం చేసుకుంది. అయితే ఈ వివాహ జీవితం కూడా ఎంతో కాలం సజావుగా సాగలేదు.

నటుడు విజయ్‌ కుమార్, నటి మంజుల పెద్ద కుమార్తె వనిత విజయకుమార్‌ (Vanitha Vijaya kumar)అందరికి సుపరిచితురాలే.. తమిళం , మలయాళం, తెలుగు, కన్నడ భాషా చిత్రాలలో నటించి నటిగా మంచి పేరు తెచ్చుకుంది. అయితే సినిమాలలో కంటే ఎక్కువగా వివాదాలతో వార్తల్లో నిలుస్తుంది


ఇప్పటికే వనిత విజయకుమార్‌ కి మూడు పెళ్ళిళ్ళు అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరోసారి ప్రేమలో పడ్డానంటూ పెద్ద బాంబ్ పేల్చింది. 10 సెప్టెంబర్ 2000 న నటుడు ఆకాష్‌ను వివాహం చేసుకుంది. ఈ దంపతులకు ఓ కుమారుడు, ఓ కుమార్తె ఉన్నారు. అయితే ఇద్దరి మధ్య విబేధాలు రావడంతో ఇద్దరు విడాకులు తీసుకున్నారు.

ఇక ఆ తర్వాత 2007 లో వ్యాపారవేత్త ఆనంద్ జే రాజన్ ను రెండో వివాహం చేసుకుంది వనితా.. వీరికి ఓ కుమార్తె ఉంది. ఇక వీరి మధ్య కూడా విభేదాలు రావడంతో 2012లో అధికారికంగా విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత కొరియోగ్రాఫర్ రాబర్ట్ తో కొన్ని రోజులు డేటింగ్ చేసింది వనితా.


ఇక పీటర్ పాల్‌ ను ఈ ఏడాది జూన్ 27 న చెన్నైలో ముచ్చటగా మూడో వివాహం చేసుకుంది. అయితే ఈ వివాహ జీవితం కూడా ఎంతో కాలం సజావుగా సాగలేదు. పీటర్ పాల్‌ తన మొదటి భార్యకి విడాకులు ఇవ్వకుండా వనిత విజయ్‌ కుమార్‌ను రెండో పెళ్లి చేసుకోవడంతో ఇద్దరి మధ్య విబేధాలు వచ్చాయి.

దీనితో ఇద్దరు విడిపోయారు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న వనితా మళ్ళీ ప్రేమలో పడ్డానని వెల్లడించింది. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ఓ పోస్ట్ కూడా పెట్టింది. అయితే అతను ఎవరు అన్నదానిపైన స్పష్టత ఇవ్వలేదు. త్వరలోనే అతన్ని నాలుగో వివాహం చేసుకోనుందని తెలుస్తోంది.

Next Story
Share it