Top
Batukamma

వర్షను భీభత్సంగా వాడేస్తున్న మల్లెమాల.. మరీ ఇంతలానా?

వర్షను భీభత్సంగా వాడేస్తున్న మల్లెమాల.. మరీ ఇంతలానా?
X
Highlights

ఇప్పటికే యాంకర్లు అనసూయ, రష్మిలతో ఫుల్ గ్లామర్ డోస్ ఉండగా, రోజా తన పని తానూ చేసుకుంటూ పోతుంది. ఈ షోలో లవ్ ట్రాక్స్ మరో పెద్ద ప్లస్ అని చెప్పాలి. ఇప్పటికే సుడిగాలి సుధీర్- రష్మీ లవ్ ట్రాక్ బాగా సక్సెస్ అయింది.

జబర్దస్త్ ప్లాట్ ఫాం చాలా మంది ఆర్టిస్టులకి బ్రేక్ ఇచ్చింది. ఇప్పుడు తెలుగు సినిమాల్లో మనం చూస్తున్నకమెడియన్స్ ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి వచ్చినవారే.. పేరుకు జబర్దస్త్ ఖతర్నాక్ కామెడి షో అయినప్పటికి గ్లామర్ విషయంలో కూడా జబర్దస్త్ హైలెటే అని చెప్పాలి.

ఇప్పటికే యాంకర్లు అనసూయ, రష్మిలతో ఫుల్ గ్లామర్ డోస్ ఉండగా, రోజా తన పని తానూ చేసుకుంటూ పోతుంది. ఈ షోలో లవ్ ట్రాక్స్ మరో పెద్ద ప్లస్ అని చెప్పాలి. ఇప్పటికే సుడిగాలి సుధీర్- రష్మీ లవ్ ట్రాక్ బాగా సక్సెస్ అయింది. ఈ జంటకి ఇప్పుడు బయట మామూలు ఫాలోయింగ్ లేదు. బయట వీరిని ఎవరు చూసినా పెళ్ళెప్పుడు అని అడుగుతుంటారు.

ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు జబర్దస్త్ లో మరో లవ్ ట్రాక్ మొదలైంది. లేటెస్ట్ గా జబర్దస్త్ కు వచ్చిన వర్ష అనే అమ్మాయి యూత్ కి నిద్ర పట్టకుండా చేస్తోంది. చేసింది రెండు స్కిట్స్ అయినప్పటికీ ఈ అమ్మడికి ఇప్పుడు మామూలు క్రేజ్ లేదు. అటు క్లీవేజ్ షో ఫోటోలతో కూడా సోషల్ మీడియాలో రచ్చ చేస్తోంది ఈ పోరి.


అయితే ఈ భామకి ఉన్న క్రేజ్ ని ఎలాగైనా బాగా వాడుకోవాలని డిసైడ్ అయింది మల్లెమాల టీం. సుధీర్, రష్మీల లాగే మరో లవ్ ట్రాక్ ని తెరపైకి తీసుకువచ్చింది. రాబోయే (డిసెంబర్ 11)న ఎపిసోడ్ లో వర్షకు, ఇమ్మాన్యుయేల్ కు మధ్య ఓ చిన్న లవ్ ట్రాక్ ఉన్నట్టుగా రివీల్ చేసింది. కెవ్వు కార్తీక్ టీంలో చేసిన ఓ స్కిట్ తర్వాత మొత్తానికి వర్షను పడేశావ్ ఏమైనా ఉందా అని రోజా అడిగితే ఎం లేదు అంటూనే ఒకరి గురించి ఒకరు చెప్పుకుంటూ అందరికీ దొరికిపోయారు.

అందరూ అందం చూడరు మనసు కూడా చూస్తారని ఇమ్మాన్యుయేల్ చెబితే, నల్లగా ఉన్నా ఏమవుతుంది మనసు బాగుండాలని వర్ష చెప్పింది. దీనితో ఇద్దరి మధ్య మంచి లవ్ ట్రాక్ ఉన్నట్టుగా ప్రోమోలో చూపించారు.. దీనికి తోడు బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ సూపర్ అంటూ రోజా ఇచ్చిన కాంప్లిమెంట్ ఈ లవ్ ట్రాక్ ని ఎక్కడికో తీసుకువెళ్ళింది.



Next Story
Share it