Top
Batukamma

Uppena Review : ఉప్పెన.. క్లైమాక్స్ అదుర్స్... సినిమా సూపర్ డూపర్ హిట్టు..!

Uppena movie review
X
Highlights

మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయం అవుతున్న చిత్రం ఉప్పెన.. సుకుమార్ రేటింగ్స్ లో ఆయన శిష్యుడు...

మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయం అవుతున్న చిత్రం ఉప్పెన.. సుకుమార్ రేటింగ్స్ లో ఆయన శిష్యుడు బుచ్చిబాబు సాన తెరకెక్కించిన ఈ చిత్రం పైన ముుందు నుంచి అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. అలా భారీ అంచనాల నడుమ సినిమా ఈ రోజు థియేటర్ లోకి వచ్చింది.. ఈ సినిమా ఎలా ఉందో మన రివ్యూలో చూద్దాం!

చెప్పడానికి ఇది పెద్ద లవ్ స్టోరీ ఏం కాదు.. రొటీన్ లవ్ స్టొరీనే.. అందరికీ తెలిసిన కథే.. మళ్లీ చూసిన కథే అనిపిస్తుంది. కానీ దర్శకుడు తెరకెక్కించిన విధానం సినిమాని ఇంకో లెవెల్ కి తీసుకెళ్ళింది. హీరోహీరోయిన్ల మధ్య సాగే సన్నివేశాలు చాలా ఫ్రెష్ ఫీలింగ్స్ ని కలిగిస్తాయి. మొదటి సినిమానే అయినప్పటికీ వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి పోటీపడి మరీ నటించారు.

ముఖ్యంగా విజయ్ సేతుపతి క్యారెక్టర్ గురించి మాట్లాడుకోవాలి. ఆయన పాత్ర, ఆయన నటన సినిమాని ఇంకో లెవల్ కి తీసుకెళ్ళింది.

ఇక సినిమా క్లైమాక్స్ సినిమాకి మేజర్ ప్లస్ పాయింట్.. క్లైమాక్స్ సీన్ కన్నీళ్లు తెప్పిస్తోంది. తెలుగు ప్రేక్షకులకు కొత్తగా అనిపిస్తుంది. సినిమా మొత్తం ఒకెత్తయితే క్లైమాక్స్ ఒకెత్తు.. ఈ సీన్ తోనే దర్శకుడి టాలెంట్ ఏంటో అర్థం అయిపోతుంది .

గురువు సుకుమార్‌లా అతని శిష్యుడు బుచ్చిబాబు.. మొదటి సినిమాతోనే మంచి టేస్ట్ ఉన్న దర్శకుడు అనిపించుకున్నాడు. ఇక సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ పాటలు మోస్ట్ ప్లస్ అయ్యాయి. పాటలు ఎంత బాగున్నాయో.. విజువల్ కూడా అంతా బాగున్నాయి. నేపథ్య సంగీతం ఆకట్టుకుంటుంది. సినిమాటోగ్రఫి అద్భుతంగా ఉంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణ విలువలు సినిమా స్థాయిని పెంచాయి.

మొత్తానికి ఉప్పెన ప్రేక్షకుడికి మంచి ఫీలింగ్ ఇస్తుంది. ఫెయిల్యూర్ లవ్ స్టోరీ ఉన్నవారు బాగా కనెక్ట్ అవుతారు. చాలా రోజుల తరవాత ప్యుర్ లవ్ స్టొరీ చూసిన ఫీలింగ్ వస్తుంది.

బతుకమ్మ రేటింగ్ 2.75/5

Next Story
Share it