Top
Batukamma

సహజనటి అంటూనే అసహజ పోస్ట్.. మీకు సిగ్గుందా?

సహజనటి అంటూనే అసహజ పోస్ట్.. మీకు సిగ్గుందా?
X
Highlights

ఈ మధ్య టాలీవుడ్ హీరోయిన్స్ మాల్దీవులకి వెళ్లి అక్కడ సరదాగా ఎంజాయ్ చేస్తూ బికినీతో ఉన్న ఫోటోలను తమ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్న సంగతి తెలిసిందే కదా

ఈ మధ్య టాలీవుడ్ హీరోయిన్స్ మాల్దీవులకి వెళ్లి అక్కడ సరదాగా ఎంజాయ్ చేస్తూ బికినీతో ఉన్న ఫోటోలను తమ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్న సంగతి తెలిసిందే కదా.. కొత్త పెళ్లి కూతురు కాజల్ తో మొదలైన ఈ రచ్చ ఆ తరవాత సమంత, వేదిక, ప్రణిత మొదలగువారు కూడా జాయిన్ అయ్యారు.

ఈ ఫోటోలు కుర్రకారుని నిద్రపట్టనివ్వకుండా చేస్తున్నాయి. ఇప్పటికే ఈ ఫోటోలని అన్ని మీడియా ఛానల్స్, అన్ని వెబ్ సైట్లు తిప్పితిప్పి వేస్తున్నాయి కూడా.. అయితే అందరిలాగా మనం కూడా అదే పోస్ట్ పెడితే పెద్ద కొత్తేమి ఉంది అనుకుందో ఏమో ఓ వెబ్ సైట్ యాజమాన్యం..


కాస్తా కొత్తగా ట్రై చేద్దామనుకొని అదే బికినీ టాపిక్ ని పాత హీరోయిన్ లకి తగిలించే వేటలో ఎక్కడో సహజనటి జయసుధ వారికి దొరికింది. ఇంకేముంది అప్పట్లో జయసుధ బికినీతో ఉన్న ఫోటోలను బయటకు తీసి కాస్తా మేకప్ వేసి, మాస్ మసాలా హెడ్డింగ్ పెట్టి వైరల్ న్యూస్ అంటూ సోషల్ మీడియాలోకి వదిలారు.

ఫోటోలు ఏమో కానీ వార్త మాత్రం బాగానే వైరల్ అయింది. అప్పుడెప్పుడో ఫోటోలను బయటకు తీసి వ్యూస్ కోసం రచ్చ చేయడం ఇప్పుడు అవసరమా అని నెటిజన్లు దుమ్మెత్తి పోస్తున్నారు. సహజనటి అంటూనే అసహజ పోస్ట్లు.. మీకు సిగ్గుందా? అంటూ సదరు వెబ్ సైట్ పైన దుమ్మెతి పోస్తున్నారు.

జయసుధ అంటే కేవలం ఆ ఫోటోలు మాత్రమే కనిపించాయా? ఎన్నో సినిమాలకి, ఎన్నో పాత్రలకి ఆమె ప్రాణం పోశారు. అవేమి మీకు గుర్తులేవు.. కానీ ఇవి మాత్రం బాగానే గుర్తున్నాయంటూ గట్టిగానే కామెంట్లలలో వేసుకుంటున్నారు నెటిజన్లు. మరికొందరు అయితే ఈ పోస్ట్ వెంటనే డిలిట్ చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు.

Next Story
Share it