Top
Batukamma

ఓ సుమక్కా.. ఓ రంగమ్మత్తా.. హైదరాబాదులోనే ఉన్నారా?

ఓ సుమక్కా.. ఓ రంగమ్మత్తా.. హైదరాబాదులోనే ఉన్నారా?
X
Highlights

అక్కా సుమక్కా ఎక్కడున్నావ్ అక్కా.. అత్తా రంగమ్మత్తా ఉన్నావా? చెల్లి రష్మి షూటింగ్ లేకా హైదరాబాదు కావాలా? శ్రీముఖి ఫోటో షూట్ లకే టైం ఉందా? రవన్నా ఎక్కడున్నావే? ప్రదీప్ భయ్యా.. హైదరాబాదులోనే ఉంటున్నావా

గత కొద్దిరోజులుగా కురిసిన వర్షాలకి హైదరాబాదు నగరం మొత్తం అతలాకుతలం అయిన సంగతి తెలిసిందే.. భారీ వర్షాలు కావడంతో నగర వాసులు చుక్కులు చూశారు. ఆ వర్షాలకి ఎంత ఆస్థి నష్టం జరిగిందో, అంత ప్రాణం నష్టం కూడా జరిగింది. ఎక్కడ చూసిన కూడా వరద భాదితులే కనిపించారు. ఒక పక్కా కరోనాతోనే భాదపడుతుంటే మరో పక్కా ఈ వరదలు అటు ప్రభుత్వాన్ని, ఇటు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేశాయి..

ఇలాంటి విపత్కర సమయంలో పక్కా రాష్ట్రం తమిళనాడు సోదరభావం చూపించింది.. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి వెంటనే ఆర్ధిక సహయం ప్రకటించాడు. ఆ తర్వాత బెంగాల్, ఢిల్లీ ప్రభుత్వాలు ముందుకు వచ్చి అదుకున్నాయి.. అప్పటికికానీ మన సినీ లోకం నిద్రలేవలేదు.. ఆ తర్వాత మహేష్, చిరు, ఎన్టీఆర్, నాగార్జున, ప్రభాస్, పవన్ కళ్యాణ్ మొదలగు వారు వారికి తోచినంతగా సహాయం చేశారు.

సరే మిగతావాళ్ళు ఎక్కడ? అన్నది అసలు ప్రశ్న.. ఏ వీరికి ఆ బాధ్యత లేదా? లేకా మనకెందుకు అనుకుంటున్నారా? హే.. హైదరాబాదులో ఉండడం లేదా? హైదరాబాద్ కి నష్టం జరిగితే వీరికి జరిగినట్టు కదా.. ఉండేది ఇక్కడ.. సంపాదించుకునేది ఇక్కడ.. బతికేది ఇక్కడ.. ఆపద వస్తే అదుకోరా? ఇవి ఇప్పుడు సగటు నగరవాసుడి మదిలో మెదులుతున్న ప్రశ్నలు..

బుల్లితెర నుంచి ఒక్కరు కూడా ముందుకు రాకపోవడం దారుణం.. యాంకర్స్ .. ఎక్కడున్నరమ్మా .. అక్కా సుమక్కా ఎక్కడున్నావ్ అక్కా.. అత్తా రంగమ్మత్తా ఉన్నావా? చెల్లి రష్మి షూటింగ్ లేకా హైదరాబాదు కావాలా? శ్రీముఖి ఫోటో షూట్ లకే టైం ఉందా? రవన్నా ఎక్కడున్నావే? ప్రదీప్ భయ్యా.. హైదరాబాదులోనే ఉంటున్నావా.. ఎక్కడ వీళ్ళంతా? హైదరాబాదు వర్షాలు వీరికి కనిపించడం లేదా? భాదితుల గోసలు వినబడడం లేదా?

సుమక్కా టాలీవుడ్ బుల్లితెర పైన నెంబర్ వన్ యాంకర్.. హెవీ రెమ్యునరేషన్ తీసుకునే యాంకర్ కూడా .. ఎంత మంది యాంకర్స్ వచ్చిన ఈమె తరువాతే.. పెరుకేనా .. సహాయంలో లేదా మరి.. కరోనా సమయంలో వారి నుంచి వీరి నుంచి విరాళాలు సేకరించావ్ ఇచ్చావ్.. ఇప్పుడేమైంది అక్కా.. నీ సొంతంగా కూడా ఇచ్చే స్తోమతలో లేవా?

అత్తా.. రంగమ్మత్తా లాక్ డౌన్ టైంలో EMI లు ఎలా కట్టుకోవాలి కేటీఆర్ సార్ అని ట్వీట్ పెట్టావ్... అలాంటి విపత్కర సమయంలో తిండి లేని వాళ్ల గురించి ఆలోచించావా? ఉపాధి కోల్పోయి ఇంట్లో వాళ్ళకి అన్నం పెట్టలేని కూలీ గురించి ఆలోచించావా? జబర్దస్త్ , యూట్యూబ్ చానళ్ స్టార్ట్ చేశావ్..బీజీ అయిపోయావ్.. ఇప్పుడు నువ్వుండే హైదరాబాదుకి కష్టం వచ్చింది ఎక్కడ నీ సాయం..? ఇక మిగతా వాళ్ళ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది..

ఏంటి కచ్చితంగా విరాళాలు ఇవ్వాలా? అది మా ఇష్టం అనొచ్చు.. కానీ ప్రేక్షకులను నటనతో మెప్పించగలిగితే ఓ నటిగా, నటుడుగానే మిగిలిపోతావ్.. ఎదుటివారికి కష్టం వచ్చినప్పుడు ఆదుకుంటేనే మానవత్వం ఉన్న మనిషి అంటారు.. సినిమా భాషలో చెప్పాలంటే రియల్ హీరోస్ అంటారు. ఎలాంటి సినిమాలు, షోలు లేకున్నా కులవృత్తి చేసుకొని సంపాదించిన డబ్బులలో వరుద భాదితులకోసం 50,000 ఇచ్చాడు..సంపూ.. మీరు అంతకన్నా దారుణమా?

Next Story
Share it