Top
Batukamma

అందరితో నటించిన శ్రీదేవి బాలయ్యతో ఎందుకు నటించలేదు?

అందరితో నటించిన శ్రీదేవి బాలయ్యతో ఎందుకు నటించలేదు?
X

శ్రీదేవి,బాలకృష్ణ  

Highlights

శ్రీదేవితో బాలయ్య నటించడానికి తిరస్కారం అంటూ ఆ మధ్య న్యూస్ కూడా వచ్చింది. అయితే ఈ విషయం పైన బాలయ్య ఇంతవరకు స్పందించలేదు.

అలనాటి అందాల తార శ్రీదేవి తెలుగులో స్టార్ హీరోలందరితో కలిసి నటించింది. ఎన్టీఆర్ నుంచి వెంకటేష్ వరకు ప్రతిఒక్కరితో జతకట్టింది. కానీ నటసింహం బాలకృష్ణతో మాత్రం ఒక్క సినిమాలో కూడా కలిసి నటించేలేదు.

దీనికి కారణం తన తండ్రి ఎన్టీఆర్ తో కలిసి నటించిన ఏ హీరోయిన్ తో కూడా తానూ నటించకూడదని బాలయ్య నిర్ణయం తీసుకున్నట్టుగా ఆ మధ్య వార్తలు కూడా వచ్చాయి.

కానీ అది నిజం కాదు. ఎందుకంటే ఎన్టీఆర్, రాధ కలిసి చండశాసనుడు అనే సినిమాలో కలిసి నటించారు. ఆ తరువాత బాలయ్యతో కూడా చాలా సినిమాల్లో జత కట్టింది రాధ.

బాలకృష్ణ, శ్రీదేవి కలిసి నటించే అవకాశం ముచ్చటగా మూడుసార్లు వచ్చింది. అయితే ఇందులో రెండు సార్లు బిజీ షెడ్యుల్ వలన శ్రీదేవి ఆ సినిమాల నుంచి తప్పుకుంది.

బాలకృష్ణ, కే. రాఘవేంద్రరావు కాంబినేషన్లో 1987లో వచ్చిన సాహస సామ్రాట్ సినిమాకి ముందుగా శ్రీదేవినే హీరోయిన్ గా అనుకున్నారు. ఆమె కుడా చేస్తానని కమిట్ అయింది. సినిమా కూడా స్టార్ట్ అయింది.

అయితే బిజీగా ఉండడం వల్లనో, మరేదో కారణమో ఏమో కానీ ఆ సినిమా నుంచి శ్రీదేవి తప్పుకుంది. ఆ తర్వాత ఆమె ప్లేస్ లో విజయశాంతిని తీసుకున్నారు.

మళ్ళీ 1989లో భలేదొంగ సినిమాకి హీరోయిన్ గా మళ్ళీ శ్రీదేవినే అనుకున్నారు. అయితే ఆ సినిమాని కూడా శ్రీదేవి రిజెక్ట్ చేసింది. దీనితో బాలయ్య ఈగో హార్ట్ అయింది. ఇక శ్రీదేవితో సినిమా చేయకూడదు అని అనుకున్నారు బాలయ్య.

బాలకృష్ణ, సింగీతం కాంబినేషన్ లో వచ్చిన ఆదిత్య 369 సినిమాకి బాలకృష్ణ సరసన శ్రీదేవినే అనుకున్నారు. కానీ ఈ సారి బాలయ్య రిజెక్ట్ చేశాడు. సింగీతం ఎంత చెప్పిన బాలయ్య నో అనేశారట!

శ్రీదేవితో బాలయ్య నటించడానికి తిరస్కారం అంటూ ఆ మధ్య న్యూస్ కూడా వచ్చింది. అయితే ఈ విషయం పైన బాలయ్య ఇంతవరకు స్పందించలేదు.

ఇక ఇదిలా ఉంటే బాలకృష్ణ, శ్రీదేవి కలిసి ఒకే ఫ్రేమ్ లో రెండు సినిమాల్లో కనిపిస్తారు అవే.. అనురాగ దేవత, రౌడీ రాముడు కొంటె కృష్ణుడు.. ఈ రెండు సినిమాల్లో బాలకృష్ణ తండ్రి ఎన్టీఆర్ సరసన నటించింది శ్రీదేవి. మరో విచిత్రం ఏంటంటే ఈ రెండు సినిమాలకి కె.రాఘవేంద్రరావు దర్శకుడు కావడం!

Next Story
Share it