Top
Batukamma

అమృత తన తండ్రి ఇంటికి తిరిగి వెళ్తుందా..?

అమృత తన తండ్రి ఇంటికి తిరిగి వెళ్తుందా..?
X
Highlights

అమృత మీడియాకి, సోషల్ మీడియాకి భయపడకుండా తన తల్లి దగ్గరకి చేరుకుంటే అంతకంటే ఈ సినిమా ద్వారా ఆశించే ప్రయోజనం ఉండదు.

"నీ చుట్టూ ఉన్న ప్రపంచం సృష్టించింది నేను కాబట్టి అందంగానే ఉంటుంది. కానీ నువ్వు బయటికి పోతే అలా ఉండదు."

"నువ్వు అడిగే ప్రతీ ప్రశ్నకి నా దగ్గర సమాధానం ఉంది నమ్రతా, కానీ వాటిని నువ్వు వేరే విధంగా అర్ధం చేసుకుని నన్ను అపార్ధం చేసుకుంటావనే భయంతోనే నేను ఏమీ మాట్లాడ్డం లేదు".

"జీవితాన్ని అతి దగ్గర నుంచి చూసి నేర్చుకున్న పాఠాల అనుభవంతో చెబుతున్నా, నీ నిర్ణయం మంచిది కాదు".

- మా(రుతీ)ధవ రావు

సహజంగానే ఒక వివాదాస్పద అంశాన్ని ఎలా తీశాడు అనే కుతూహలం కొద్దీ ఈ సినిమా చూశాను (not a justification). కేవలం ఇక తండ్రి దృష్టి కోణంలో నుంచి తీసిన సినిమా కాబట్టి అతని వైపు నుంచే ఈ సినిమా ఉంది. ప్రణయ్ వైపు వెర్షన్ కాదిది. అది ఎవరన్నా తీస్తే అది కూడా చూద్దాం.

చదువు లేకుండా ఆలోచనల్లో బాగా పరిణతి ఉన్న వాళ్ళతో ప్రత్యక్షంగా గంటలకొద్దీ గడిపే అవకాశం లేని, డబ్బు, పరపతి, పరువు సంపాదనే లక్ష్యంగా మిర్యాలగూడ లాంటి మధ్యతరగతి పట్టణంలో బతికిన, ఏకైక కూతురిని ప్రాణంగా ప్రేమించిన తండ్రి మీద అమృత ప్రణయ్ ల వివాహం, దాని చుట్టూ అల్లుకున్న వివిధ అంశాల దుష్ర్పభావం చాలా ఎక్కువ ఉండే అవకాశం ఉంది. సినిమాలో చూపించినట్టుగా రోజుల తరబడి నిద్ర లేకుండా మద్యం తాగుతూ బాధ పడే అవకాశం కూడా ఉంది.ఈ సినిమా రాకముందు కూడా మారుతీరావుపై సమాజంలో చాలా వర్గాల్లో సానుభూతి ఉంది. సోషల్ నెట్వర్కుల్లో బయటపడడానికి భయపడ్డారు కానీ వ్యక్తిగతంగా జరిగిన సంభాషణల్లో మారుతీరావుపై సానుభూతి వ్యక్తం చేశారు. ప్రణయ్ హత్య చాల పెద్ద విషయమే గానీ, దాన్ని కేవలం ఒక పరిణామంగా మాత్రమే చూశారు వాళ్ళు.

ఈ సినిమా చూశాక మారుతీరావుపై ఉన్న సానుభూతి జాలిగా మారే అవకాశం ఉంది. కష్టం అంటే ఏంటో తెలీకుండా పెరిగిన ఒక కూతురు తొందరపడి తీసుకున్న నిర్ణయానికి ఇన్ని జీవితాలు బలయ్యాయా అనిపించక మానదు.

శ్రీకాంత్ అయ్యంగార్ మారుతీరావు పాత్రకి ప్రాణం పోశాడు. తల్లి పాత్రలో నటించిన నటి కూడా అద్భుతంగా నటించింది. ఒక చిన్న పట్టణంలో వెయ్యి కోట్లు సంపాదించిన ఒకే ఒక్క మనిషికి ఉండే ప్రతిష్ట ఎలా ఉంటుందో నేను మార్కాపురంలో చూశాను. అలాంటి మనిషికి ఉన్న ఏకైక కూతురు ప్రేమించింది అంటే ఆ డబ్బుకి వారసులం అయిపోయి చరిత్ర సృష్టించవచ్చు అనే ఆలోచన కలగడం కూడా సహజం. సమాధానం చెప్పడానికి ప్రణయ్ లేడు కాబట్టి సినిమాలో "అతను డబ్బు అడిగాడు", "వీడియోస్ పంపాడు" అనే ఆరోపణలమీద, అతని కారెక్టర్ మీద నిందలు వేసి చర్చించడం సంస్కారం కాదు.

ఈ సినిమా చూడడం ద్వారా కూతుళ్లు తండ్రులను అర్ధం చేసుకుని వారి ఇష్టాఇష్టాలకు అనుగుణంగా నడుచుకోవడం, అమృత మీడియాకి, సోషల్ మీడియాకి భయపడకుండా తన తల్లి దగ్గరకి చేరుకుంటే అంతకంటే ఈ సినిమా ద్వారా ఆశించే ప్రయోజనం ఉండదు.

బాధ్యత లేని ప్రేమల గురించి, ఒకసారి కమిట్ అవడం (నేను కూడా ప్రేమిస్తున్నాను అని) వల్ల, అది చాలా మందికి తెలిసిపోయింది కాబట్టి, ఆ తర్వాత కాలంలో ప్రేమ లేకపోయినా దాన్ని వెనక్కి తీసుకుని ముందుకుపోయే ధైర్యం లేక కొనసాగించే చాలా మంది ప్రేమ కథల గురించి ఇంకెప్పుడైనా చర్చించుకుందాం.

-Ravikanth reddy.ఎం

- బిత్తిరి సత్తికి మళ్లీ పెళ్లంట.. రచ్చ రచ్చ చేస్తున్నడు..!

- రామ్ చరణ్ మరదలుతో శర్వానంద్ పెళ్లి?

- సిక్రెట్ గా పెళ్లి చేసుకొని ఫ్యాన్స్ షాక్ ఇచ్చిన వరంగల్ బ్యూటీ!

Next Story
Share it