Top
Batukamma

Congress MLA falls into Flood water : కాలుజారి బుదరలో పడిన కాంగ్రెస్ ఎమ్మెల్యే

Congress MLA falls into Flood water : కాలుజారి బుదరలో పడిన కాంగ్రెస్ ఎమ్మెల్యే
X
Highlights

Congress MLA falls into Flood water : వరద ప్రభావిత గ్రామాల్లో ప్రజలను పరామర్శించేందుకు వెళ్లిన కాంగ్రెస్...

Congress MLA falls into Flood water : వరద ప్రభావిత గ్రామాల్లో ప్రజలను పరామర్శించేందుకు వెళ్లిన కాంగ్రెస్ ఎమ్మెల్యే కాలుజారి పడిపోయారు. ఉత్తరాఖండ్ కు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే హరీశ్ ధామి పితోర్ ఘర్ జిల్లా దార్చులా పరిధిలో పర్యటనకు వెళ్లారు.

ఈ ఏరియాలో కొద్ది రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో లుమ్టి, మోరి గ్రామాల ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని సమాచారం వచ్చింది. దీంతో అక్కడి పరిస్థితిని పరిశీలించేందుకు ఎమ్మెల్యే వెళ్లారు. కారులో వెళ్లే పరిస్థితి లేకపోవడంతో కొంతదూరం కాలినడకన వెళ్లి గ్రామస్తులను పరామర్శించి తిరుగు పయనమయ్యారు.

దారిలో ఓ చోట నీటి ప్రవాహనం పెరగడంతో ఆయన అదుపుతప్పి కిందపడిపోయారు. కొద్ది దూరం కొట్టుకుపోయారు. అతనితో పాటు ఉన్న కార్యకర్తలు ఆయనను పట్టుకున్నారు. ఈ ప్రమాదంలో ఆయనకు స్వల్ప గాయాలయ్యాయి. స్థానికంగా ఉన్న ఆర్మీ క్యాంప్ లో డాక్టర్లు ఆయనకు ప్రథమచికిత్స్ చేసి పంపించారు.

[embed]https://twitter.com/ANI/status/1289026016539631616[/embed]

Next Story
Share it