Top
Batukamma

కరీంనగర్ కరోనా హాట్ స్పాట్.. అప్పుడు మర్కజ్... ఇప్పుడు...?

కరీంనగర్ కరోనా హాట్ స్పాట్.. అప్పుడు మర్కజ్... ఇప్పుడు...?
X
Highlights

రాష్ట్రంలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. రాష్ట్రంలో నిన్న1676 మందికి కరోనా నిర్ధారణ అయ్యింది. అయితే...

రాష్ట్రంలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. రాష్ట్రంలో నిన్న1676 మందికి కరోనా నిర్ధారణ అయ్యింది. అయితే శాంపిల్ టెస్టుల ఫలితాలు పూర్తిస్థాయిలో వెల్లడించడం లేదనే ఆరోపణలున్నాయి.

మరోవైపు.. కరీంనగర్ జిల్లా మరోసారి కరోనా హాట్ స్పాట్ గా మారుతోంది. నిన్న కరీంనగర్ జిల్లాలో 92 కేసులు నమోదయ్యాయి. ఇందులో కరీంనగర్ టౌన్ లోనే భారీగా కేసులున్నాయి. జిల్లా కేంద్రంలోని ప్రధాన ప్రాంతాల్లో ఎక్కువ మంది కరోనా భారిన పడ్డారు. ఇక కరీంనగర్ టౌన్ లోని దాదాపు అన్ని ప్రాంతాల్లో కరోనా బాధితులున్నారు.

Gangula-1

నిన్న ఒక్కరోజే కాదు.. గత కొన్ని రోజులుగా కరీంనగర్ లో కేసులు భారీగానే నమోదవుతున్నాయి. ఇటీవల ఒక రోజు 80 కేసులకు పైగా నమోదయ్యాయి. ప్రతీరోజు భారీగా కేసులు రికార్డవుతూనే ఉన్నాయి.

కేసుల సంఖ్య పెరగడంతో కరీంనగర్ మరోసారి వార్తల్లో నిలిచింది. రాష్ట్రంలో మొదటి సారి భారీగా కరోనా కేసులు బయటపడింది కరీంనగర్ జిల్లాలోనే. మర్కజ్ నుంచి వచ్చిన వాళ్లు, వారితో వచ్చిన ఇండోనేషియన్లు 13 మందికి కరోనా రావడం అప్పట్లో సంచలనంగా మారింది.

తర్వాత కరీంనగర్ టౌన్ లోని ముకరంపుర ప్రాంతాన్ని కంటైన్ మెంట్ జోన్ గా ప్రకటించారు. రాష్ట్రంలో మొదటి కంటైన్ మెంట్ జోన్ కూడా ఇదే. కంటైన్ మెంట్ జోన్ లో పూర్తి రాకపోకలు నిషేధించి నిత్యావసరాలు కూడా మున్నసిపల్ సిబ్బందే అందజేశారు. దీంతో కరోనాను సమర్థవంతంగా అడ్డుకోగలిగారు.

corona in Karimnagar

పకడ్బంధీ చర్యలతో అప్పట్లో కరీంనగర్ లో కరోనా కట్టడి చేయగలిగారు. కానీ ఇప్పుడు ఇన్ని రోజుల గ్యాప్ తర్వాత జిల్లాలో భారీగా కరోనా కేసులు పెరగడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు.

అయితే.. అధికారులు మాత్రం ప్రజలు భయపడాల్సిన పని లేదంటున్నారు. ట్రీట్మెంట్ చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని చెబుతున్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ హాస్పిటల్ తో పాటు.. రెండు ప్రయివేటు మెడికల్ కాలేజీల్లో కొవిడ్ వార్డులు ఏర్పాటు చేశామని చెబుతున్నారు.

Next Story
Share it