Corona Cases Today In Telangana : ఇవాళ కూడా భారీగా పెరిగిన కేసులు

Corona Cases Today In Telangana : రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. నిన్న ఉదయం నుంచి ఇవాళ ఉదయం వరకు...
Corona Cases Today In Telangana : రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. నిన్న ఉదయం నుంచి ఇవాళ ఉదయం వరకు రాష్ట్రంలో 1811 మందికి కరోనా నిర్ధారణ అయ్యిందని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ ప్రకటించింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు మొత్తం 60717 మందికి కరోనా సోకింది.
రాష్ట్రంలో నిన్న 18 వేల 263 మంది కరోనా టెస్టులు చేశారు. ఇందులో 1811 మందికి పాజిటివ్ వచ్చిందని ఆరోగ్యశాఖ బులిటెన్ లో తెలిపింది. ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తంగా 4,16,202 మంది టెస్టులు చేసినట్టు చెప్పింది.
- గృహలక్ష్మి ఫేం ‘కస్తూరి’ మాములుగా రెచ్చిపోలేదుగా!
- అనసూయలో ఈ కొత్త యాంగిల్ చూశారా..?
- బొడ్డు చూపించి బౌల్డ్ చేస్తున్న తెలుగు యాంకర్!
నిన్న గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 521 మందికి కరోనా నిర్ధారణ అయ్యింది. మేడ్చల్ మల్కాజ్ గిరిలో 151, రంగారెడ్డి 289, వరంగల్ అర్బన్ 102 , కరీంనగర్ లో 97 మందికి కరోనా నిర్ధారణ అయ్యింది. నిన్న కరోనాతో 13 మంది ప్రాణాలు కోల్పోయారు.
అయితే.. ఇతర సమస్యలతో ఉన్న వారు కరోనాతో చనిపోతే కరోనా మరణంగా గుర్తించబోమంటూ ఆరోగ్యమంత్రి ఈటల రాజేందర్ ప్రకటించారు.
ఆరోగ్యశాఖ లెక్క ప్రకారం నిన్న 13 మంది చనిపోయారు. కానీ ఇతర ఆరోగ్యసమస్యలుండి కరోనాతో చనిపోయిన వారి లెక్క కూడా కలిపితే అది ఎక్కువగా ఉండే ఛాన్స్ ఉంది.