Top
Batukamma

CORONA NEW DANGER : కరోనా కొత్త డేంజర్.. కోలుకున్నా కోలుకోనట్టే..!

CORONA NEW DANGER : కరోనా కొత్త డేంజర్..  కోలుకున్నా కోలుకోనట్టే..!
X
Highlights

CORONA NEW DANGER REVEALED : కరోనా వైరస్ మరికొద్ది రోజుల్లో తగ్గిపోతుందనే ఆశతో అంతా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ ...

CORONA NEW DANGER REVEALED : కరోనా వైరస్ మరికొద్ది రోజుల్లో తగ్గిపోతుందనే ఆశతో అంతా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ టైంలో వైరస్ గురించి రోజుకో షాకింగ్ న్యూస్ చెబుతున్నారు సైంటిస్ట్ లు. కరోనా వైరస్ కు సంబంధించి ఇప్పటికే చాలా షాకింగ్ విషయాలు చెప్పారు.

వైరస్ గాలి ద్వారా కూడా వ్యాపిస్తోందన్నారు. అలాగే.. వ్యాక్సిన్ వచ్చినా కరోనాను అడ్డుకోవడం కష్టమేనని.. బాడీలో సొంతాం ఇమ్యూనిటీ ఉంటే తప్ప.. కరోనా నుంచి బయటపడలేమని చెప్పారు. ఒకసారి వస్తే ప్రతీ ఏడాది దీని ఎఫెక్ట్ ఉంటుందన్నారు.

ఇప్పుడు కరోనాకు సంబంధించి మరో బ్రేకింగ్ న్యూస్ చెప్పారు చైనాలోని వుహాన్ యూనివర్సిటీ సైంటిస్టులు. అయితే.. గతంలో చెప్పిన విషయాలకంటే ఇది చాలా భయంకరమైనది.

oxford vaccine in india for clinical trials

ఎందుకంటే.. కరోనా వైరస్ నుంచి కోలుకున్న చాలామంది తమకు ఇక వైరస్ సోకదని.. తాము గతంలో మాదిరిగా ఆరోగ్యంగా ఉన్నామని అనుకుంటున్నారు. కానీ ఇందులో నిజం లేదని వుహాన్ యూనివర్సిటీ సైంటిస్టులు చెబుతున్నారు.

కరోనా నుంచి కోలుకున్నాక కూడా చాలామంది ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్నారని వీరి అధ్యయనంలో తేలింది. వుహాన్ లో ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు కరోనా సోకి.. కోలుకున్న వారిని అబ్జర్వేషన్ లో పెట్టారు. వీరిలో 90 శాతం మందికి ఊపిరితిత్తుల సమస్యలు వచ్చినట్టు గుర్తించారు.

ఆరోగ్యంగా ఉన్నట్టుగానే కనిపించినా.. ఊపిరితిత్తులు మాత్రం సక్రమంగా పనిచేయడం లేదని వారు తెలిపారు. 90 శాతం మందికి లంగ్స్ ప్రాబ్లమ్ వస్తే.. ఇందులో 5 శాతం మంది మళ్లీ హోం క్వారంటైన్ లో ఉండాల్సి వచ్చిందని సైంటిస్టులు చెప్పారు.

కరోనా నుంచి కోలుకున్న వారిని కొద్ది దూరం నడిపించి ఈ ప్రయోగం చేశారు. వీళ్లు 6 నిమిషాల్లో 400 అడుగులు మాత్రమే నడిచారు. అదే ఆరోగ్యంగా ఉన్నవారు 6 నిమిషాల్లో 500 మీటర్లు నడిచారు. ఊపిరితిత్తుల్లోని వాయు ప్రసరణ వ్యవస్థలో సమస్యల కారణంగానే ఇలా జరిగిందని గుర్తించారు.

Next Story
Share it