Top
Batukamma

Corona media : కరోనా.. మీడియా చూపించినంత డేంజర్ ఏం కాదు..!

Corona media : కరోనా.. మీడియా చూపించినంత డేంజర్ ఏం కాదు..!
X
Highlights

కరోనా పేషంట్  ని పట్టుకున్నా ముట్టుకున్నా కరోనా రాదు. మిగతా చోట్ల వారి తుంపర్లు మన శరీరరంలో ఎక్కడ పడ్డా కూడా కరోనా రాదు.

Corona not dangerous as what media showing : నాకు వచ్చింది పోయింది... మీడియా బాగా భయపెట్టింది కానీ కరోనా అంత ఈజీగా రాదు..

గాలిలో 12 గంటలు ఉంటుంది,ముట్టుకుంటే వస్తుంది,పట్టుకుంటే వస్తుంది,చిటికెన వేలు మీద కోట్లాది క్రిములు ఉంటాయి అంటుకుంటే మశే అనేదంతా తెలిసీ తెలియని మాటలే... కరోనా పేషంట్ ని పట్టుకున్నా ముట్టుకున్నా కరోనా రాదు. కరోనా ఉన్నవారు తుమ్మితేనో దగ్గితేనో వారి తుంపర్లు మన కంటిలోనో,నోట్లోనో పడితే కరోనా వస్తుంది.అంతే తప్ప మిగతా చోట్ల వారి తుంపర్లు మన శరీరరంలో ఎక్కడ పడ్డా కూడా కరోనా రాదు.

ఒకవేళ కరోనా వచ్చినా కూడా ఏమీ కాదు..నాకు వచ్చింది పోయింది. ఇరుకు ఇంట్లో ఉన్నా కూడా మా భార్య పిల్లలకు కరోనా రాలేదు అంటేనే అర్థం అవుతుంది అది అంత ఈజీగా రాదు అని. నాకు మొదటి రోజు జ్వరం రాగానే మా ఏరియాలోని బస్తీ దవాఖానకు వెళ్తే చెక్ చేసి రెండు గంటల తర్వాత కరోనా పాజిటివ్ అని కాల్ చేసి చెప్పారు.

ఐతే కరోనా రావాలనే నేను కోరుకున్నాను. వస్తే చూద్దాం దాని సంగతి ఏందో అనే ఆలోచనలోనే నేను ఉన్నాను. నేను అనుకున్నట్లుగానే కరోనా వచ్చింది.సరే అని మా ఇంట్లో వాళ్లకు చెబితే మా అమ్మ కొంచెం ఏడ్చింది. మా భార్య బాధ భయంతో కూడిన ఆలోచనలో పడింది.ఏమీ కాదు అమ్మ నువ్వు ఇప్పుడే పిల్లలను తీసుకుని అక్క వాల్ల ఇంటికి వెల్లు నేను ఆస్మా ఉంటాము అని చెప్పి అమ్మను పంపించాను.

రెండు రోజులు జ్వరం ఉంది. నాలుగు రోజులు రుచి వాసన లేదు. తర్వాత అన్నీ సెట్ అయ్యాయి. కరోనా వచ్చిందని ప్రత్యేకమైన తిండి ఏమీ తినలేదు రోజూ తినేవే తిన్నాను. మూడు పూటలా అవిరైతే పట్టుకున్నాను. ప్రముఖ వైద్యులు, నిమ్స్ నెఫ్రాలజీ విభాగం డాక్టర్ Sree Bhushan Raju గారు నాకోసం పల్స్ ఆక్సీ మీటర్ ఇంటికి పంపించారు.తన అమూల్యమైన సమయాన్ని నాకోసం కేటాయించి నజీర్ ఏమీ కాదు అని నాలుగైదు సార్లు ఫోన్లు చేసి భరోసా కల్పించారు.

నాకు కరోనా వచ్చింది అనే విషయాన్ని నాకు తెలిసిన పెద్దలు గౌరవ ఎమ్మెల్సీ శ్రీ Seri Subash Reddy, డిజిటల్ మీడియా డైరెక్టర్ Dileep Konatham గార్లకు చెప్పాను వారు కూడా గొప్పగా స్పందించి నజీర్ ఏమీ కాదు ఒకవేళ నీకేమైన ప్రాబ్లమ్ అయితే ప్రభుత్వం ద్వారా మంచి వైద్యం అందించేందుకు మేము సిద్ధంగా ఉన్నాము అని వారు కూడా నాకు కొండంత భరోసా ఇచ్చారు.

Corona Studies Series' to be launched by National Book Trust

ఐతే ఎవరి సహాయం కూడా అవసరం లేదని నాకు తర్వాత అనిపించింది. ఎందుకంటే నాకు కరోనా వచ్చిన తర్వాత 2వ రోజు నుండి వైద్య ఆరోగ్య శాఖ, మరియూ ఇతర శాఖల నుండి కాల్స్ వచ్చాయి.నజీర్ బాగున్నారా,మీకు ఏమైనా బ్రీతింగ్ సమస్య ఉందా అని ఎప్పటికప్పుడు తెలంగాణ ఆరోగ్య శాఖ వారు వాకబు చేసారు.మన ప్రభుత్వం కరోనా పేషంట్ల పట్ల చాలా గొప్పగా స్పందిస్తుందనడానికి నా అనుభవమే ఉదాహరణ.

మనకు కరోనా వస్తే ఎవరి సహాయం కోరాల్సిన అవసరం ఎంత మాత్రమూ లేదు.మనకు ఊపిరి సమస్య ఉంటే చక్కగా పాజిటివ్ రిపోర్ట్ పట్టుకుని నాలుగు జతల బట్టలు పెట్టుకుని ఏ ప్రభుత్వ హాస్పిటల్ కి పోయినా పరవాలేదు. మంచిగా చూసుకుంటారు. ఐతే అంత ఈజీగా రాదని అనుకోకుండా మన జాగ్రత్తలో మనం ఉండాలి. మీడియానే దీన్ని ఏదో యుగాంతం లెవల్లో భయపెట్టింది అని నేను అంటున్నాను. అంతే తప్ప అంతగా భయపడాల్సిన అవసరం లేదని నా అభిప్రాయం.

ఇంత చేసినా చివరికి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చెప్పినట్టే అందరూ చెబుతున్నారు. కరోనా వస్తే ఏమీ కాదు,భయపడాల్సిన అవసరం లేదు. కేవలం పారాసిటమాల్ వేసుకుంటే సరిపోతుందని. ఇదే మాట సీఎం కేసీఆర్ గారు నిండు అసెంబ్లీలో ఎప్పుడో అన్నారు.దానికి కొంతమంది హేళన చేసారు. తర్వాత వాళ్ళూ అదే మాట అంటున్నారు ప్రస్తుతం ... పూర్తిగా కోలుకున్నాకే పోస్ట్ పెట్టాలని పెడుతున్న.పెద్దల దయ,దేవుడి ఆశీస్సుల వల్ల ప్రస్తుతం సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాను.

READ ALSO :

Next Story
Share it