Top
Batukamma

Telangana Corona virus Update: మళ్ళీ భారీగా పెరిగిన కరోనా కేసులు!

Telangana Corona virus Update: మళ్ళీ భారీగా పెరిగిన కరోనా కేసులు!
X
Highlights

Telangana Corona virus Update: నిన్న మొన్న తగ్గుముఖం పట్టే కరోనా వైరస్ కేసులు ఇవాళ మళ్ళీ భారీగానే పెరిగాయి.....

Telangana Corona virus Update: నిన్న మొన్న తగ్గుముఖం పట్టే కరోనా వైరస్ కేసులు ఇవాళ మళ్ళీ భారీగానే పెరిగాయి.. గడచిన 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 2012 కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో కలిపి మొత్తం రాష్ట్రవ్యాప్తంగా 70,958 కేసులు నమోదయ్యాయి.

ఇక కోలుకున్న వారి సంఖ్య 50,814 కి చేరుకుంది. ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 19,568గా ఉంది. ఇక 24 గంటల్లో 13 మంది కరోనా వైరస్ తో పోరాడి చనిపోయారు. మృతుల సంఖ్య 576 కి చేరుకుంది. ఇక నిన్న మొత్తం 21,118 శాంపిల్స్ నీ పరీక్షించగా మొత్తం టెస్టుల సంఖ్య 5,22,143 కి చేరుకుంది.

గత 24 గంటల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలో 532 పాజిటివ్‌ కేసులు ఉన్నాయి. మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లాలో 198, రంగారెడ్డి జిల్లాలో 188, వరంగల్‌ అర్బన్‌లో 127, ఖమ్మం 97, సంగారెడ్డిలో 89, నిజామాబాద్‌ 83, నల్గొండలో 49, పెద్దపల్లి జిల్లాలో 41, మహబూబ్‌నగర్‌లో 51, జోగులాంబ గద్వాల్‌ జిల్లాలో 48, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో 46, భద్రాద్రి కొత్తగూడెంలో 52, కరీంనగర్‌ 41, కామారెడ్డిలో 75 కేసులు నమోదయ్యాయి.

Image

Next Story
Share it