దళిత ఎమ్మెల్యేతో కూతురు పెళ్లి.. బ్రాహ్మణ మామ సూసైడ్ అటెంప్ట్!

MLA Prabhu Love Marriage : తమిళనాడుకు చెందిన ఓ దళిత ఎమ్మెల్యే ఓ సామాన్య అర్చకుడి కూతురి పెళ్లి చేసుకున్నాడు.....
MLA Prabhu Love Marriage : తమిళనాడుకు చెందిన ఓ దళిత ఎమ్మెల్యే ఓ సామాన్య అర్చకుడి కూతురి పెళ్లి చేసుకున్నాడు.. అయితే ఇది నచ్చని యువతి తండ్రి ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన తమిళనాడులోని కల్లకూరిచిలో చోటు చేసుకుంది..
ఇక వివరాల్లోకి వెళ్తే.. తమిళనాడులోని కల్లకూరిచి (Kallakurichi) నియోజకవర్గంకి చెందిన అన్నాడీఎంకే (AIADMK) పార్టీ ఎమ్మెల్యే ప్రభు(34)(MLA Prabhu Love Marriage).. బీఏ రెండో సంవత్సరం చదువుతున్న సౌందర్య(19) అనే యువతిని గత మూడు సంవత్సరాలుగా ప్రేమిస్తున్నాడు..
ఈ విషయాన్నీ యువతి ఇంట్లో చెపితే వీరి కులాలు వేరు కావడం, ఇద్దరి మధ్య వయసు తేడా(అమ్మాయికి 19, అబ్బాయికి 34ఏళ్లు) ఉండడంతో సదరు ఎమ్మెల్యేను అల్లుడిగా యువతి తండ్రి స్వామినాథన్ అంగీకరించలేదు.. దీనితో అత్యంత సన్నిహితుల మధ్య ప్రభు, సౌందర్యను సోమవారం (అక్టోబర్ 5)న వివాహం చేసుకున్నాడు.
అయితే దీనిని తట్టుకోలేక యువతి తండ్రి స్వామినాథన్ పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించారు, దీంతో ఎమ్మెల్యే పెళ్లి తమిళనాడు వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
అయితే ఎమ్మెల్యే ప్రభు తన కుమార్తెను అపహరించి బలవంతంగా వివాహం చేసుకున్నాడని, అంతేకాకుండా పెళ్లికి ఒప్పుకోకపోతే మమ్మల్ని చంపేస్తామని బెదిరించాడని ఎమ్మెల్యే పైన త్యాగదురుగం పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు స్వామినాథన్ .
ఇక ఆత్మహత్య ప్రయత్నం చేసినందుకు గాను స్వామినాథన్ పైన ఐపిసి సెక్షన్ 309 కింద నమోదు అయింది. దీనిపైన అర్చకుడి కూతురు సౌందర్య మాట్లాడుతూ.. ‘నేను ప్రభుని ప్రేమించాను. వివాహం చేసుకోవాలని నన్ను ఎవరు బలవంతం చేయలేదు’ అని పేర్కొంది. అటుతమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత టికెట్ ఇవ్వడంతో 2016 ఎన్నికల్లో పోటీ చేసి గెలిచారు ప్రభు..
Also Read :
- Kajal Wedding : కాజల్ పెళ్లి చేసుకోబోతున్న వ్యక్తి ఎవరంటే..?
- ADHIRINDI SHOW : నాగబాబు,శ్రీముఖికి శ్రద్ధాంజలి..! ఇంతకీ ఏంజరిగింది..?
- ఈ నెల 15 నుంచి స్కూళ్లు.. గైడ్ లైన్స్ ఇవే!
- ‘ఐరన్ లెగ్ శాస్త్రి’… ఇదే పేరు జీవితాన్ని నాశనం చేసింది!
- ఆత్మహత్య చేసుకున్న IAS భార్యకి కాంగ్రెస్ భారీ ఆఫర్!
https://youtu.be/qfNmp6eAIjg
- AIADMK AIADMK MLA batukamma. batukamma.com Dalit MLA Prabhu kallakurichi mla kallakurichi mla intercaste marriage Kallakurichi MLA Prabhu MLA Prabhu Love Marriage mla prabhu marriage MLA Prabhu wife Soundarya tamil nadu ఎమ్మెల్యే ప్రభు కల్లకూరిచి తమిళనాడు ప్రేమ పెళ్లి చేసుకున్న ఎమ్మెల్యే స్వామినాథన్