Top
Batukamma

Danger Situation In Hyderabad : హైదరాబాద్ లో ప్రమాదకర పరిస్థితులు..!

Danger Situation In Hyderabad : హైదరాబాద్ లో ప్రమాదకర పరిస్థితులు..!
X
Highlights

Danger Situation In Hyderabad : తెలంగాణలో కరోనా బీభత్సం సృష్టిస్తోంది. ప్రతి రోజు కేసులు పెరుగుతున్నాయి తప్ప...

Danger Situation In Hyderabad : తెలంగాణలో కరోనా బీభత్సం సృష్టిస్తోంది. ప్రతి రోజు కేసులు పెరుగుతున్నాయి తప్ప తగ్గడం లేదు. హైదరాబాద్ లో పరిస్థితి మారీ దారుణంగా ఉంది.

నిన్న రాష్ట్ర వ్యాప్తంగా1554 పాజిటివ్ కేసులు రాగా.. ఒక్క హైదరాబాద్ లోనే 842మందికి పాజిటివ్ కేసులు వచ్చాయి. 9 మంది కరోనాతో చనిపోయినట్టు సర్కారు బులిటెన్ లో చెప్పింది.

Image

కానీ కరోనా మరణాల విషయంలో మొదటి నుంచి సర్కారు అబద్ధాలు చెబుతోందనే ఆరోపణ ఉంది. సర్కారు కావాలనే మరణాల సంఖ్య దాస్తోందని అంటున్నారు.

దీనికి బలమైన ఆధారం ఇప్పుడు బయటకొచ్చింది. హైదరాబాద్ లోని ESI శ్మశానవాటికలో ప్రతి రోజు 30 నుంచి 50 వరకు డెడ్ బాడీలను కాలుస్తున్నారని అంటున్నారు. శ్మశానవాటికలో డెడ్ బాడీలను కాలుస్తున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

[embed]https://twitter.com/revathitweets/status/1285985279895986176?s=20[/embed]

ఒకేసారి చాలా డెడ్ బాడీలను దహనం చేస్తున్నారు. అయితే.. హిందూ సాంప్రదాయం ప్రకారం సాయంత్రం 6 తర్వాత అంత్యక్రియలు చేయరు. కానీ ESI శ్మశానవాటికలో చీకటి పడ్డాక డెడ్ బాడీలు కాల్చేయడంపై విమర్శలు వస్తున్నాయి. కరోనా పేషెంట్లవి కాబట్టే అలా సాంప్రదాయానికి విరుద్ధంగా కాల్చేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.

దీనిపై కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క కూడా ఫైర్ అయ్యారు. ప్రభుత్వం లెక్కలు దాస్తోందనడానికి ఇదే నిదర్శనమంటూ ఆమె వీడియో విడుదల చేశారు.

[embed]https://twitter.com/seethakkaMLA/status/1285978471043182592[/embed]

[embed]https://www.facebook.com/217997488609619/videos/1653877181448338[/embed]

సర్కారు మాత్రం ప్రతిరోజు బులిటెల్ లో తక్కువ మరణాలే చూపిస్తోంది. రాష్ట్రంలో డెత్ రేట్ తక్కువగా ఉందని చెబుతోంది.

Next Story
Share it