Top
Batukamma

Danger Situation In Telangana Districts : ప్రమాదంలో ఉత్తర తెలంగాణ జిల్లాలు..!

Danger Situation In Telangana Districts : ప్రమాదంలో ఉత్తర తెలంగాణ జిల్లాలు..!
X
Highlights

Danger Situation In Telangana Districts : కరోనా వైరస్ ఇప్పుడు మరింత ఉధృతం కాబోతోంది. అయితే తెలంగాణలో ఇప్పటి...

Danger Situation In Telangana Districts : కరోనా వైరస్ ఇప్పుడు మరింత ఉధృతం కాబోతోంది. అయితే తెలంగాణలో ఇప్పటి వరకు హైదరాబాద్ కే పరిమితమైన కరోనా బీభత్సం.. ఇకపై జిల్లాలకు విస్తరించనుందని సాక్షాత్తు ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందరే వెల్లడించారు.

ఇప్పటికే జిల్లాలో వైరస్ ఉధృతి పెరిగింది. కరీంనగర్ లో కొద్ది రోజులుగా ప్రతిరోజు 70 నుంచి 80 కేసులు నమోదవుతున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో నిన్న 90కి పైగా కేసులు నమోదయ్యాయి. నిజామాబాద్ లోనూ 50కి పైగా కేసులు రికార్డయ్యాయి.

నాలుగైదురోజుల క్రితం తక్కువ కేసులున్న జిల్లాల్లోనూ ప్రస్తుతం చాలా ఎక్కువ కేసులు వస్తున్నాయి. అయితే.. ఇది వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం, మహబూబ్ నగర్ జిల్లాల్లో మరింత ఎక్కువగా ఉంటుందని అధికారులు చెబుతున్నారు. రాబోయే నాలుగైదు వారాలు డేంజర్ పరిస్థితులు ఉంటాయని అప్రమత్తంగా ఉండాలని అంటున్నారు.

దీనిపై రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటలరాజేందర్ జిలా వైద్యాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. అందరు అలర్ట్ గా ఉండాలని ఆదేశించారు. జిల్లా కేంద్రాల్లో మరిన్ని ఐసోలేషన్ కేంద్రాలు ఏర్పాటుచేసుకోవాలని చెప్పారు. మెడికల్ స్టాఫ్, ల్యాబ్ టెక్నీషియన్లు, శానిటైజేషన్ సిబ్బందిని నియమించుకోవాలని సూచించారు.

ఏకంగా రాష్ట్రమంత్రే ఈ విషయం చెప్పడంతో ఇప్పుడు జిల్లా అధికారుల్లో టెన్షన్ మొదలైంది. మామూలుగా కేసులు వచ్చినప్పుడే ట్రీట్మెంట్ విషయంలో ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు ఎలా ఎదుర్కొంటారనేది సవాల్ గా మారింది.

Next Story
Share it