Subscribe

News, Telangana

వరంగల్ మర్డర్ మిస్టరీ.. ఆ రాత్రి ఏం జరిగింది..?

death mistory of warangal migrant family

వరంగల్ రూరల్ జిల్లా గొర్రెకుంటలో కూలీల మరణాల మిస్టరీ వీడటం లేదు. ఒకే బావిలో 9 మంది శవాలు బయటపడటం సంచలనంగా మారింది. దీంతో అక్కడ ఏం జరిగిందనేది ఇప్పుడు అంతుచిక్కడం లేదు. బావిలో గురువారం నాలుగు శవాలు, శుక్రవారం ఐదు శవాలు బయటపడ్డాయి. వీరిలో ఆరుగురు ఒకే కుటుంబానికి చెందిన వారు కావడం సంచలనంగా మారింది.

బుధవారం మధ్యాహ్నం వరకు వీరంతా ఒకే దగ్గర ఉన్నారు. కలిసే ఉన్నారని తెలుస్తోంది. అయితే సడెన్ గా ఏం జరిగింది..? బుధవారం రాత్రి.. గురువారం తెల్లారేసరికి ఏం జరిగింది..? ఇప్పుడు పోలీసులను వేధిస్తున్న ప్రశ్నలు ఇవే. ప్రస్తుతం ఈ ప్రశ్నలకు జవాబులు వెతికే పనిలో పోలీసులు బిజీగా ఉన్నారు.

Image

పది రోజుల క్రితం వీరికి వేరే వారితో గొడవ జరిగిందని పోలీసుల విచారణలో తేలింది. ఒకవేళ గొడవ పడిన వాళ్లే వీరిని చంపారనుకుంటే.. ముగ్గురు వేరే ఫ్యామిలీకి చెందిన వాళ్లు కూడా ఉన్నారు. వీరందరిని ఎందుకు చంపుతారు.?

మృతుడు మక్సూద్ కూతురి ప్రేమ వ్యవహారంపైనా పోలీసులు ఫోకస్ పెట్టారు. ఈ ఘటనలో మక్సూద్ కూతురు కూడా చనిపోయింది. అందరి మరణానికి ఆమె లవ్ ఎఫైర్ కి ఏమైనా సంబంధం ఉందా.? అనే యాంగిల్ లోనూ ఎంక్వైరీ నడుస్తోంది. అమ్మాయి వాడిన ఫోన్ కాల్ డేటా తీసుకున్న పోలీసులు.. ఎక్కువ కాల్స్ మాట్లాడిన యాకూబ్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

మరోవైపు.. మొదట వీరందరిని హత్య చేసి ఉంటారని పోలీసులు భావించారు. కానీ శరీరంపై ఎలాంటి గాయాలు లేకపోవడంతో ఆత్మహత్యే అయి ఉంటుందని అనుకున్నారు. అయినా.. ఒకేసారి ఇంతమంది ఎందుకు సూసైడ్ చేసుకుంటారు. ? ఇందులో వేరే ఫ్యామిలీ వాళ్లు ఎందుకు ఉన్నారు.? అనే ప్రశ్నలు వచ్చాయి.

విషప్రయోగం కోణంలోనూ విచారణ చేస్తున్నారు. కానీ పోస్ట్ మార్టంలో ప్రాథమికంగా ఎలాంటి పాయిజన్ ఆనవాల్లు లభించలేదు. దీంతో శరీరభాగాలను ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించారు. ఫోరెన్సిక్ రిపోర్ట్ వస్తేనే కేసు కాస్త ముందుకు కదిలే అవకాశాలు కనిపిస్తున్నాయి.

వీటన్నింటికి సమాధానం తెలియాలంటే ముందు ఓ విషయంపై క్లారిటీ రావాలి. అది.. బుధవారం రాత్రి ఏం జరిగింది? మక్సూద్, షకీల్ కలిసి ఏం చేశారు..? బుధవారం మధ్యాహ్నం నుంచి కలిసే ఉన్న వీళ్లు ఆ తర్వాత ఏం చేశారు.? ఇంటినుంచి వంద మీటర్ల దూరంలో ఉన్న బావి దగ్గరకు ఎందుకు వెళ్లారు.? ఎలా వెళ్లారు..? ఎవరైనా తీసుకెళ్లి తోసేశారా..? ఇంతమంది బావిలో పడినప్పుడు.. ఒకరి సాయంతో ఒకరు.. కనీసం ఒకరిద్దరైనా బయటపడాలి. కానీ అది జరగలేదు. 9 మంది ఒకే బావిలో ప్రాణాలు వదిలారు.

అంటే మత్తు మందు ఏమైనా ఇచ్చి బావిలో తోసేశారా..? నిజంగా అదే జరిగితే.. ఒక్కరితో అయ్యే పని కాదు. ఇందులో చాలామంది ఇన్వాల్స్ మెంట్ ఉండాలి. వారంతా ఎవరు..? ఎందుకు ఈ పనిచేశారు..? కూలీ పనిచేసుకునే వారిని చంపాల్సిన అవసరం ఎవరికి ఉంది..? ఇప్పుడు ఈ ప్రశ్నలన్నింటికి సమాధానం తెలిస్తేనే కేసు ఓ కొలిక్కి వచ్చే ఛాన్స్ ఉంది.

 

(Visited 7 times, 1 visits today)