Top
Batukamma

Delhi Rape : ఢిల్లీలో మరో నిర్భయకాండ.. ఎంత దారుణమంటే...

Delhi Rape : ఢిల్లీలో మరో నిర్భయకాండ.. ఎంత దారుణమంటే...
X
Highlights

Delhi Rape One Person Arrested : ఢిల్లీలో మరోసారి దారుణం జరిగింది. నిర్భయ ఘటన మరిచిపోకముందే అలాంటిదే మరో ఘటన...

Delhi Rape One Person Arrested : ఢిల్లీలో మరోసారి దారుణం జరిగింది. నిర్భయ ఘటన మరిచిపోకముందే అలాంటిదే మరో ఘటన జరిగింది. ఓ బాలికపై ఓ దుండగుడు కిరాతకంగా లైంగిక దాడి చేశాడు. తీవ్రంగా గాయపర్చడంతో బాలిక ప్రాణాపాయస్థితిలో ఉంది.

12 ఏళ్ల బాలికను నిర్భందించిన ఓ యువకుడు ఆమెపై అత్యాచారం చేసినట్టు తెలుస్తోంది. ఆ దుర్మార్గుడు అక్కడితో ఆగలేదు. బాలిక తలతో పాటు. ఇతర సున్నిత ప్రాంతాల్లో తీవ్రంగా గాయపరిచాడు. దీంతో తీవ్రంగా రక్తస్రావం జరిగింది.

విషయం తెలుసుకున్న స్థానికులు బాలికను హాస్పిటల్ కు తరలించారు. ప్రస్తుతం బాలిక ఢిల్లీ ఎయిమ్స్ లో ట్రీట్మెంట్ తీసుకుంటోంది. దారుణం గురించి తెలియగానే సీఎం కేజ్రీవాల్ కూడా స్పందించారు. హాస్పిటల్ కు వెళ్లి బాధితురాలి కుటుంబసభ్యులను పరామర్శించారు. నిందితుడిపై కఠినచర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

అయితే.. బాలిక పరిస్థితి సీరియస్ గా ఉందని డాక్టర్లు చెబుతున్నారు. తీవ్రంగా గాయాలు, రక్తస్రావం కావడంతో బాలిక అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయిందని అంటున్నారు.

ఇక సీసీ ఫుటేజీ ఆధారంగా అనుమానితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ఇంటరాగేషన్ చేస్తున్నారు. నిందితుడికి కఠినశిక్ష పడేలా చూస్తామన్నారు.

Next Story
Share it