Top
Batukamma

DHONI : రిటైర్మెంట్ తర్వాత ధోనీ ఏం చేయబోతున్నాడు..?

DHONI : రిటైర్మెంట్ తర్వాత ధోనీ ఏం చేయబోతున్నాడు..?
X
Highlights

ఇప్పుడు ఆయన ఏం చేయబోతున్నారని చాలా ఆసక్తికరంగా మారింది. అంతర్జాతీయ టోర్నీల నుంచి రిటైర్మెంట్ తీసుకున్న ఫ్యూచర్ ఏంటీ అనేది ఇంట్రెస్టింగ్ ఇష్యూ.

DHONI AFTER RETIREMENT : స్టార్ క్రికెటర్ మహేంద్ర సింగ్ దోనీ అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ చై చెప్పారు. ఇకపై అంతర్జాతీయ టోర్నీల్లో పాల్గొనబోనని ప్రకటించారు. దీంతో ఆయన ఫ్యాన్స్ నిరాశలో మునిగిపోయారు. కరోనా లేకుంటే ఈ పాటికి టీ20 వరల్డ్ కప్ తో పాటు.. ఐపీఎల్ సందడి ఉండేది. కానీ కరోనా కారణంగా టోర్నీలు వాయిదా పడ్డాయి

ఈ నేపథ్యంలోనే ధోనీ(DHONI) ఇంటర్నేషనల్ టోర్నీ నుంచి రిటైర్ అయ్యారు. అయితే.. ఇప్పుడు ఆయన ఏం చేయబోతున్నారని చాలా ఆసక్తికరంగా మారింది. అంతర్జాతీయ టోర్నీల నుంచి రిటైర్మెంట్ తీసుకున్న ఫ్యూచర్ ఏంటీ అనేది ఇంట్రెస్టింగ్ ఇష్యూ.

అయితే.. ఇంటర్నేషనల్ టోర్నీల నుంచి రిటైర్ అయినా.. ఐపీఎల్ లో మాత్రం కంటిన్యూ అవుతారని తెలుస్తోంది. చెన్నై సూపర్ కింగ్స్ తరుపున ఆయన మరో రెండు మూడేళ్ల పాటు క్రికెట్ ఆడే అవకాశాలున్నాయని తెలుస్తోంది. అయితే.. మూడేళ్ల నిబంధన ఏం లేదని. ఆయనకు నచ్చినన్ని రోజులు ఐపీఎల్ ఆడతారని సన్నిహితులు చెబుతున్నారు.

dhoni-mahendra-singh-

అలాగే మరో కీలక నిర్ణయం కూడా తీసుకున్నడట ధోనీ. ఆయన ఇప్పటికే టెరిటోరియల్ ఆర్మీలో లెఫ్టినెంట్ కల్నల్ హోదాలో ఉన్నారు. గతంలో చాలా సార్లు సరిహద్దుకు కూడా వెళ్లివచ్చారు. 2019వరల్డ్ కప్ తర్వాత చాలా రోజుల పాటు ఆర్మీ ట్రైనింగ్ తీసుకున్నారు.

DHONI UNIFORM

ఆర్మీ శిక్షణలో భాగంగా పారాచూట్ రెజిమెంట్ లో ధోనీ ప్రత్యేక శిక్షణ తీసుకున్నాడు. ఇప్పుడు ఆట నుంచి రిటైర్ కావడంతో.. ఆర్మీలో ఎక్కువ రోజులు గడిపే అవకాశాలున్నాయని ఆయన మిత్రుడు బిజినెస్ పార్ట్ నర్ అరుణ్ పాండే చెబుతున్నారు. ఇకపై ఎక్కువ సమయం ఆర్మీకే కేటాయించనున్నట్టు ఆయన చెప్పారు.

అలాగే.. తన వ్యాపారాలకు మిగతా సమయం కేటాయిస్తారని అరుణ్ పాండే చెప్పారు. ఇన్ని రోజులు ఆటలో బిజీగా ఉండి ఎక్కువగా బిజినెస్ పై ఫోకస్ పెట్టలేకపోయాడని.. ఇకపై ఫుల్ కాన్సంట్రేషన్ పెట్టే ఛాన్స్ ఉందంటున్నారు.

ఇప్పుడు మరో విషయం పైనా చాలా చర్చ జరుగుతోంది. ధోనీ రిటైర్ అయ్యాడు కాబట్టి.. ఆయన బ్రాండ్ వాల్యూ తగ్గుతుందనే మాట వినిపిస్తోంది. అయితే.. ధోనీ బ్రాండ్ వాల్యూ ఏం తగ్గలేదంటున్నాడు పాండే. ధోనీ ఒక యూత్ ఐకాన్ అని.. ఆయన బ్రాండ్ వాల్యూ తగ్గడం అసాధ్యమని చెబుతున్నాడు.

dhoni csk

సాధారణంగా వరల్డ్ కప్ వంటి కీలక టోర్నీలో టీం ఓడిపోతే ఆటగాళ్ల బ్రాండ్ వాల్యూ తగ్గిపోతుంది. కమర్షియల్ అగ్రిమెంట్లు తగ్గిపోతాయి. కొన్నిసార్లు గతంలో ఉన్న అగ్రిమెంట్ కూడా కాన్సిల్ అయ్యే అవకాశాలుంటాయి.

కానీ ధోనీ విషయంలో మాత్రం ఇది పూర్తిగా రివర్స్ అయ్యిందంటున్నరు. వరల్డ్ కప్ ఓడిపోయిన తర్వాత కూడా ధోనీ 10 కమర్షియల్ అగ్రిమెంట్లపై సంతకం చేశాడట.

..

READ ALSO :

Next Story
Share it