ఆత్మహత్య చేసుకున్న IAS భార్యకి కాంగ్రెస్ భారీ ఆఫర్!

DK Kusma Joins BJP : కర్ణాటకకి చెందిన దివంగత ఐఏఎస్ అధికారి డీకే రవి భార్య డీకే కుసుమ రాజకీయ ప్రవేశం చేశారు....
DK Kusma Joins BJP : కర్ణాటకకి చెందిన దివంగత ఐఏఎస్ అధికారి డీకే రవి భార్య డీకే కుసుమ రాజకీయ ప్రవేశం చేశారు. ఈరోజు (ఆదివారం) కర్ణాటక పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ సమక్షంలో ఆమె పార్టీలో చేరారు. ఆమెను పార్టీలోకి ఆహ్వానిస్తూ డీకే శివకుమార్ ఆమెకి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
త్వరలో జరుగనున్న రాజమహేశ్వరీ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో ఆమెను బరిలోకి దింపే అవకాశం ఉంది.. ఎమ్మెల్యే సీటు హామీ మేరకే కుసుమ పార్టీలో చేరినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఇప్పటికే ఆమె పేరును హైకమాండ్‌కు సిఫారసు చేసినట్లు పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ వెల్లడించారు.
డీకే కుసుమ విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించారు. రాజమహేశ్వరీ సిట్టింగ్ ఎమ్మెల్యే మునిరత్నం కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పి బీజేపీలో చేరారు. దీంతో అక్కడ ఉప ఎన్నిక అనివార్యం అయింది. బీజేపీ నుంచి తిరిగి ఆయనే పోటిలో నిలిచే అవకాశం ఉంది.
ఇక ఈ స్థానానికి గాను ఉప ఎన్నికలు నవంబర్ 3 న జరగనున్నాయని ఇప్పటికే ఎన్నికల సంఘం ప్రకటించింది.
ఇక కర్ణాటక ఐఎఎస్ డికె రవి 2015 లో ఆత్మహత్య చేసుకున్నారు. ప్రభుత్వం ఒత్తిడి కారణంగా ఆత్మహత్య చేసుకున్నట్టుగా తల్లిదండ్రులు ఆరోపించారు. మరోవైపు, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన యువతితో ప్రేమ వ్యవహారం కారణంగా ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు వార్తలు వచ్చాయి.
తరువాత, ప్రభుత్వ ఆదేశాల మేరకు నిర్వహించిన సిబిఐ విచారణ డికె రవి ఆత్మహత్యను నిర్ధారించింది. వ్యక్తిగత కారణాల వల్ల అతను ఆత్మహత్య చేసుకున్నట్లుగా సిబిఐ ధృవీకరించింది.