Top
Batukamma

Donald Trump : ట్రంప్ కు కరోనా రావడానికి కారణం ఆయనేనట..!

Donald Trump : ట్రంప్ కు కరోనా రావడానికి కారణం ఆయనేనట..!
X
Highlights

ట్రంప్ కు కరోనా రావడంపై సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి. సరిగ్గా నెలరోజుల్లో అమెరికా అధ్యక్ష ఎన్నికలున్నాయి.

Donald trump and melania tested posotive for corona : అమెరికా అధ్యక్షడు డొనాల్డ్ ట్రంప్ కు ఎలక్షన్ ముందు పెద్ద షాక్ తగిలింది. ఆయనతో పాటు, ఆయన భార్య మెలానియా ట్రంప్ కు కరోనా పాజిటివ్ వచ్చింది. ఈ విషయాన్ని ట్విట్టర్ లో ప్రకటించారు. ప్రస్తుతం ఇద్దరు కూడా వైట్ హౌస్ లో క్వారంటైన్ అయ్యారు.

ట్రంప్(Donald Trump) ఆరోగ్యం నిలకడగానే ఉందని.. తక్కువ సింప్టమ్స్ ఉన్నాయని వైట్ హౌస్ డాక్టర్లు ప్రకటించారు. ఆయన రోజువారి అధికార కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారని చెప్పారు.

[embed]https://twitter.com/realDonaldTrump/status/1311892190680014849?s=20[/embed]

ట్రంప్ తో సన్నిహితంగా ఉండే ఓ అధికారి ద్వారానే ఆయనకు వైరస్ సోకినట్టు తెలుస్తోంది. అధికారికి పాజిటివ్ రావడంతోనే ట్రంప్ టెస్ట్ చేయించుకున్నారు. అందులో ఆయనకు పాజిటివ్ రిపోర్ట్ వచ్చింది. దీంతో ఇతర సిబ్బందిని కూడా టెస్ట్ చేయించుకోవాలని సూచించారు.

అయితే.. ట్రంప్ కు కరోనా రావడంపై సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి. సరిగ్గా నెలరోజుల్లో అమెరికా అధ్యక్ష ఎన్నికలున్నాయి. నవంబర్ 3న అధ్యక్ష ఎన్నికలు మొదలవుతున్నాయి. ఇప్పుడిప్పుడే ఎన్నికల ప్రచారం ఊపందుకుంటోంది.

రెండు రోజుల క్రితమే జోయ్ బిడెన్, ట్రంప్... డిబేట్ లో పాల్గొన్నారు. ఇలాంటివి మరో రెండు డిబేట్లు జరగాల్సి ఉంది. కానీ అంతలోనే ట్రంప్ కు కరోనా వచ్చి.. హోం క్వారంటైన్ అయ్యారు. 14 రోజుల పాటు కచ్చితంగా ఇంట్లోనే ఉండాలి.

దీంతో.. ఇదంతా బిడెన్ చేశారంటూ సెటైర్లు వేస్తున్నారు నెటిజన్లు. ట్రంప్ ను ప్రచారానికి వెళ్లకుండా అడ్డుకునేందుకు ఇలా చేశారంటూ... జోకులు పేలుస్తున్నారు.

..

TRENDING VIDEO :

[embed]https://youtu.be/UdjrzqXOGbE[/embed]

Next Story
Share it