Top
Batukamma

ఆగస్టు 17 నుంచి ఇంజినీరింగ్ క్లాసులు

ఆగస్టు 17 నుంచి ఇంజినీరింగ్ క్లాసులు
X
Highlights

విద్యాశాఖపై రివ్యూ చేసిన సీఎం కేసీఆర్ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. విద్యావ్యవస్థను పూర్తి స్థాయిలో...

విద్యాశాఖపై రివ్యూ చేసిన సీఎం కేసీఆర్ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. విద్యావ్యవస్థను పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసి, ప్రభుత్వ విద్యాసంస్థలను బలోపేతం చేయాలని నిర్ణయించారు. దీనికోసం దీర్ఘకాలిక వ్యూహం రూపొందించి అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. దీనికోసం విద్యావేత్తలు, నిపుణులతో వెంటనే సమావేశం నిర్వహించి, అభిప్రాయాలు సేకరించాలని అధికారులను ఆదేశించారు.

విద్యాసంవత్సరం ప్రారంభానికి సంబంధించి పలు నిర్ణయాలు తీసుకున్నారు. ఆగస్ట్ 17 నుంచి ఇంజినీరింగ్ విద్యాసంవత్సంర ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నారు. స్టూడెంట్స్ విద్యాసంవత్సరం కోల్పోకుండా ఉమ్మడి ప్రవేశ పరీక్షల షెడ్యూల్ తయారుచేస్తామన్నారు.

రాష్ట్రంలో పాఠశాలలను ఎప్పుడు పున:ప్రారంభించాలి..? విద్యాబోధన ఎలా జరగాలి..? అనే విషయాలపై కేంద్ర మార్గదర్శకాలను పాటించాలన్నారు. అలాగే ఇతర రాష్ట్రాలు అనుసరిస్తున్న విధానాలను పరిశీలించి త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.

Image

అలాగే.. యూజీసీ, ఏఐసీటీఈ సూచనల ప్రకారం రాష్ట్రలో డిగ్రీ, పీజీ, ఇంజినీరింగ్ ఫైనల్ ఇయర్ పరీక్షలు నిర్వహించాలన్నారు. మిగతా తరగతుల వారికి ఎలాంటి పరీక్షలు లేకుండా ప్రమోట్ చేయాలన్నారు.

‘కేసీఆర్ కిట్స్ పథకం అమలు చేయడంతో పాటు, ప్రభుత్వ వైద్యశాలల్లో సదుపాయాలు పెంచడం పేదలకు ఉపయోగపడిందన్నారు సీఎం. దీని ద్వారా ప్రజలకు ప్రభుత్వ వైద్యశాలలపై ప్రజలకు నమ్మకం ఏర్పడిందన్నారు. వైద్యరంగంలో దోపిడీ ఆగిందన్నారు.

అదే విధంగా ప్రభుత్వ విద్యాసంస్థలను బలోపేతం చేయడం ద్వారా ప్రజలకు మేలు కలుగుతుందని.. ప్రయివేటు దోపిడీ ఆగిపోతుందని సీఎం అభిప్రాయపడ్డారు.

Next Story
Share it