Top
Batukamma

Actress Rajitha : ఆ రెండు సినిమాలు కొంప ముంచాయి : నటి రజిత

Actress Rajitha : ఆ రెండు సినిమాలు కొంప ముంచాయి : నటి రజిత
X
Highlights

Actress Rajitha : సినీ నటి రజిత అందరికీ సుపరిచితురాలే.. సినీ ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పనిచేసే రజిత ...

Actress Rajitha : సినీ నటి రజిత అందరికీ సుపరిచితురాలే.. సినీ ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పనిచేసే రజిత బ్యాక్ గ్రౌండ్ గురించి ఎవరికి పెద్దగా తెలియదు.. రజితది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పుగోదావరి జిల్లాలోని కాకినాడ.. రజిత చిన్నప్పుడే వాళ్ళ నాన్న చనిపోయారు.. వాళ్ళ అమ్మే అన్ని బాగోగులు చూసి పెద్దది చేసింది..

రజిత పిన్ని రాగిణి సినిమాల మీద ఉన్న పిచ్చితో చెన్నైకి వచ్చి అవకాశాలను అందిపుచ్చుకుంది.. ఆమె నటించే సినిమాల షూటింగ్ లకి రజిత వెళ్ళినప్పుడు అక్కడ పరుచూరి గోపాలకృష్ణ రజితను చూసి ఈమెలో మంచి టాలెంట్ ఉందని గుర్తుంచి దర్శకేంద్రుడు రాఘవేంద్రరావుకి పరిచయం చేస్తే ఆయన అగ్నిపుత్రుడు సినిమాలో అక్కినేని నాగేశ్వరరావు కూతురు పాత్రని ఇచ్చారు..

Telugu Actress Rajitha Aunty Unseen Photos - YouTube

ఇక అక్కడి నుంచి రజిత లైఫ్ మారిపోయింది.. మలయాళ, తమిళ్ భాషల్లో హీరోయిన్ గా కూడా నటించింది రజిత.. కానీ ఎన్ని సినిమాలు చేసిన మాతృభాషను మిస్ అవుతున్నాననే బాధ మాత్ర్రం ఆమెలో ఉండేది.. దీనితో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారి అవకాశాల కోసం ప్రయత్నం చేసి సుమారుగా 400 కి పైగా సినిమాల్లో నటించింది రజిత..

అక్క, అత్త, పిన్ని పాత్రలలో ఎక్కువగా కనిపిస్తుంది రజిత.. అయితే రెండు సినిమాల్లో మాత్రం ఆ పాత్రలు పోషించినందుకు గాను ఇప్పటికి బాధపడుతూ ఉంటారట రజిత.. అవే కబడ్డీ కబడ్డీ.. నవ్వుతూ బ్రతకలిరా.. ఆ రెండు పాత్రలు అసభ్యకరంగా చిత్రీకరించారని తాను అభ్యంతరం పెట్టడంతో కబడ్డీ కబడ్డీ సినిమాలో కొన్ని సీన్లను మార్చి తీశారని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది రజిత..

https://youtu.be/yx0gNHfq-K8

అయితే రజిత ఎందుకు పెళ్లి చేసుకోలేదు అంటే సింపిల్ ఆన్సర్ ఇస్తుంది ఈ ఆంటీ.. తనకి సంసారం, పిల్లలు కంటే ఆధ్యాత్మిక చింతన ఎక్కువని అంటుంది..ఇప్పటికి సినిమాలు లేకపోతే ఆధ్యాత్మిక భావన లొనే ఉంటానని అంటుంది రజిత.. మిగతా ఆర్టిస్టుల లాగా తాను క్లబ్బులు, పబ్బులు అంటూ తిరగడం ఇష్టం లేదని అంటుంది.

Next Story
Share it