Fist Fight On KLM Flight : మాస్క్ పెట్టుకోలేదని ఎలా కొట్టారో చూడండి(వీడియో)

fist fight on KLM flight : ఓ ఇద్దరు ఫ్రెండ్స్ ఫుల్లుగా తాగారు. విమానం ఎక్కారు. ఎక్కితే ఎక్కారు కొవిడ్ రూల్స్...
fist fight on KLM flight : ఓ ఇద్దరు ఫ్రెండ్స్ ఫుల్లుగా తాగారు. విమానం ఎక్కారు. ఎక్కితే ఎక్కారు కొవిడ్ రూల్స్ పాటించాలి కదా.. కానీ వాళ్లు పాటించలేదు. మాస్క్ పెట్టుకోలేదు. పక్కనే ఉన్నవారు చెప్పినా పట్టించుకోలేదు. పైగా వారిపైనే తిరగబడ్డారు. దీంతో ఫ్లైట్ లో ఉన్నవాళ్లంతా ఒక్కటై మాస్క్ పెట్టుకోకుండా కూర్చున్న ఇద్దరిని చితక్కొట్టారు.
ఈ ఘటన అమ్ స్టర్ డాం నుంచి ఐబిజా వెళ్తున్న KLM విమానంలో జరిగింది. బ్రిటన్ కు చెందిన ఇద్దరు యువకులు మాస్క్ పెట్టుకోకుండా విమానం ఎక్కారు. ప్రస్తుతం విమానంలో జర్నీ చేయాలంటే ఫేస్ ప్రొటెక్షన్ కంపల్సరీ అని KLM ఎయిర్ లైన్స్ రూల్ పెట్టింది.
- ఇవాళ్టి బంగారం, వెండి ధరలు
- పాపం సాక్షి టీవీ.. ఈ అమ్మాయితో పరేషాన్..!
- టీవీ9పై రివేంజ్ మిగిలే ఉందంటున్న బిత్తిరిసత్తి..!
కానీ ఇద్దరు యువకులు మాత్రం ఇవేవీ పట్టించుకోకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. దీంతో వారిని కిందపడేసి.. బట్టలు చిరిగిపోయి.. రక్తం కారేలా కొట్టారు.
[embed]https://youtu.be/XAGjDb3ds84[/embed]
- నేను ఇంట్లోనే ఉన్నా.. అదే ఇంటికొచ్చింది..!
- ఇదే అయోధ్యలోని భవ్య రామమందిరం
- సుశాంత్ చనిపోయే ముందు గూగుల్ లో ఏం వెతికాడు..?
అయితే.. అప్పటికి ఫ్లైట్ ఇంకా టేకాఫ్ కాకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ గొడవతో క్యాబిన్ నుంచి పైలెట్లు కూడా లోపలికి వచ్చి ఆ ఇద్దరికి కిందకు తీసుకెళ్లి పోలీసులకు అప్పజెప్పారు. విమానంలో పడిన రక్తపు మరకలను క్లీన్ చేశాక విమానం టేకాఫ్ అయ్యింది.
ఇవి కూడా చదవండి :