Top
Batukamma

Forbes india : ఫోర్బ్స్ జాబితాలో మేఘా కృష్ణారెడ్డి. ఇద్దరు సీఎంల సపోర్ట్ ఉందిగా..!

Forbes india : ఫోర్బ్స్ జాబితాలో మేఘా కృష్ణారెడ్డి. ఇద్దరు సీఎంల సపోర్ట్ ఉందిగా..!
X
Highlights

ఈ సారి అత్యంత ధనవంతుల జాబితాలో నలుగురు తెలుగు వారు చేరిపోయారు.

Forbes india richest persons 2020 :దేశంలోని అత్యంత వంద మంది ధనవంతుల జాబితాను ప్రకటించింది ఫోర్బ్స్. వరుసగా 13వసారి దేశంలో అత్యంత ధనవంతుడిగా రికార్డు సాధించారు రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ. గతంలో 37.3 బిలియన్ డాలర్లుగా ఉన్న సంపద.. ఇప్పుడు 88.7 బిలియన్ డాలర్లకు చేరింది. తన సంపదలో 73 శాతం వృద్ధి సాధించారు అంబానీ. ఇక 25.2 బిలియన్ డాలర్ల సంపదతో గౌతమ్ అదానీ రెండో స్థానంలో నిలిచారు.

20.4 బిలియన్ డాలర్ల సంపదతో HCL శివ్ నాడార్ దేశంలో మూడో అత్యంత ధనవంతుడిగా నిలిచారు. అవెన్యూ సూపర్ మార్కెట్స్ (డీమార్ట్) సంస్థ అధినేత రాధాకృష్ణన్ దమాని నాలుగో స్థానంలో ఉన్నారు. హిందూజా బ్రదర్స్ 12.8 బిలియన్ డాలర్లతో ఐదో స్థానంలో ఉన్నారు.

11.5 బిలియన్ డాలర్ల తో సైరస్ పూనావాలా, 11.4 బలియన్ డాలర్లతో పల్లోంజి మిస్త్రీ ఏడో స్థానంలో, 11.3 బిలియన్ డాలర్లతో కోటక్ మహీంద్రా ఎండీ ఎనిమిదో స్థానంలో నిలిచారు.11 బిలియన్ డాలర్ల సంపదతో గోద్రేజ్ 9వ స్థానంలో, ఎయిర్ టెర్ చైర్మన్ సునీల్ భారతి మిట్టల్.. 10.3 బిలియన్ డాలర్లతో పదో స్థానంలో నిలిచారు.

ఈ సారి అత్యంత ధనవంతుల జాబితాలో నలుగురు తెలుగు వారు చేరిపోయారు. 6.5 బిలియన్ డాలర్ల నెట్ వర్త్ తో 20 వ స్థానంలో దివీస్ మురళి, 3.25 బిలియన్ డాలర్లతో 43 వ స్థానంలో డాక్టర్ రెడ్డీస్ ఫ్యామిలీ, 3.1 బిలియన్ డాలర్లతో 45వ స్థానంలో మెఘా ఇంజనీరింగ్ పీపీ రెడ్డి, కృష్ణారెడ్డి, 2.9 బిలియన డాలర్లతో అరబిందో రాంప్రసాద్ రెడ్డి ఫోర్బ్స్ లిస్ట్ లో ప్లేస్ సంపాదించారు. కరోనా టైంలో వందమంది ధనవంతుల ఆదాయం 14 శాతం పెరిగిందని ఫోర్బ్స్ ప్రకటించింది.

Next Story
Share it