Top
Batukamma

హనీమూన్ ట్రిప్ ను బాగా ఎంజాయ్ చేస్తున్న కాజల్ దంపతులు!

హనీమూన్ ట్రిప్ ను బాగా ఎంజాయ్ చేస్తున్న కాజల్ దంపతులు!
X

Kajal Aggarwal Honeymoon

Highlights

Kajal Aggarwal Honeymoon Photos: టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ పెళ్లి ఇటివల గౌతమ్ కిచ్లుతో అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే.. కొన్ని రోజులు ప్రేమించుకున్న వీరు పెద్దలను ఒప్పించి ఒక్కటయ్యారు..

Kajal Aggarwal Honeymoon Photos: టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ పెళ్లి ఇటివల గౌతమ్ కిచ్లుతో అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే.. కొన్ని రోజులు ప్రేమించుకున్న వీరు పెద్దలను ఒప్పించి ఒక్కటయ్యారు.. పెళ్లి తర్వాత హనీమూన్ వెళ్ళిన ఈ జంట అక్కడ ఫుల్ గా ఎంజాయ్ చేస్తోంది.. దీనికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


బ్యాచిలర్ లైఫ్ కు ఇటీవలే గుడ్ బై చెప్పేసిన డార్లింగ్ బ్యూటీ కాజల్ అగర్వాల్.. ఇప్పుడు టూర్ లలో బిజీగా ఉంది. భర్తతో కలిసి ఫుల్ గా తిరిగేస్తోంది. ఈ మధ్య ముంబైలో ఫుల్ గా చక్కర్లు కొట్టిన భామ.. హనీమూన్ కోసం ఫారిన్ చెక్కేసింది.


మాల్దీవుల్లోని ఓ రిసార్ట్ లో భర్తతో కలిసి రిలాక్స్ అవుతోంది. దీనికి సంబంధించిన ఫొటోలు తన ఇన్ స్టా గ్రామ్ అకౌంట్ లో షేర్ చేసింది ఈ బ్యూటీ. రెడ్ కలర్ లాంగ్ స్కర్ట్ లో తన అందాలను ఆరబోస్తోంది.


అయితే.. కరోనా నేపథ్యంలో కాజల్ అగర్వాల్ తన హనీమూన్ పోస్ట్ పోన్ చేసిందనే వార్తలు వచ్చాయి. కానీ.. ఈ కొత్త జంట మాత్రం ఎగురుతూ వెళ్లి మాల్దీవుల్లో వాలిపోయింది. ఫుల్ గా ఎంజాయ్ చేస్తోంది.




















Next Story
Share it