Vikarabad Girl murderd : వికారాబాద్ లో బాలికను చంపి.. ప్లాస్టిక్ కవర్ లో పెట్టి......!

హత్రాస్ ఘటనపై దేశమంతా ఆందోళనలు జరుగుతున్నాయి.. ఇప్పుడు తెలంగాణలోనూ ఇలాంటి దారుణమే జరిగింది.
Girl murderd and buried at vikarabad of Telangana : హత్రాస్ ఘటనపై దేశమంతా ఆందోళనలు జరుగుతున్నాయి. నిందితులను కఠినంగా శిక్షించాలని.. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలనే డిమాండ్లు వస్తున్నాయి.
ఓ వైపు నిరసనలు కొనసాగుతుండగానే.. దారుణాలు మాత్రం ఆగడం లేదు. ఇప్పటికే హత్రాస్ కాకుండా యూపీలో రెండు మూడు ఘటనలు జరిగాయి. రాజస్థాన్, మధ్యప్రదేశ్ లోనూ ఇలాంటి దారుణాలు బయటకు వచ్చాయి.
ఇప్పుడు తెలంగాణలోనూ ఇలాంటి దారుణమే జరిగింది.
వికారాబాద్ జిల్లాలో(Vikarabad Girl murderd) దారుణఘటన వెలుగుచూసింది. ఓ మైనర్ బాలికను హత్యచేశారు దుండగులు. బాలికను హత్యచేసి ప్లాస్టిక్ కవర్ లో చుట్టి.. వికారాబాద్ కోటిపల్లి ప్రాజెక్టు కింది వైపు పూడ్చిపెట్టారు.
ఓ పశువుల కాపరి చూసి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో దారుణం బయటకు వచ్చింది. విషయం తెలుసుకున్న పోలీసులు స్పాట్ కు వెళ్లి మృతదేహాన్ని బయటకు తీశారు. పోస్ట్ మార్టం కోసం తరలించారు. ఆ బాలిక ఎవరనేది గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు.
- శవం మాట్లాడుతుంది కాబట్టే.. శవాన్ని నామరూపం లేకుండా చేశారు!
- Karimnagar bjp : కరీంనగర్ బీజేపీ ముఖ్యనేత రాసలీలల బాగోతం..!
ఈ దారుణం ఇవాళ జరగలేదని.. నాలుగు రోజుల క్రితమే జరిగి ఉంటుందని పోలీసులు చెబుతున్నారు. డెడ్ బాడీ కూడా కొంత వరకు పాడయ్యిందంటున్నారు.
అయితే.. బాలిక ఎవరు..? ఎవరు చంపారు..? ఎలా చంపారనే విషయాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. వేలిముద్రలతో పాటు ఇతర టెక్నికల్ ఎవిడెన్స్ సేకరించే పనిలో ఉన్నారు.
READ ALSO :
- batukamma Batukamma.com girl murder in telangana girl murdered at vikarabad Girl_murderd_and_buried_at_vikarabad_of_Telangana Hathras Hathras case hathras lady rape and murder vikarabad deadbody vikarabad girl muder vikarabad police బతుకమ్మ వికారాబాద్ బాలిక హత్య వికారాబాద్ మైనర్ హత్య వికారాబాద్ లో మైనర్ బాలిక హత్య హత్రాస్