Top
Batukamma

TRUMP GOLD : బంగారం ధరలు పెంచుతున్న ట్రంప్ కరోనా..!

TRUMP GOLD : బంగారం ధరలు పెంచుతున్న ట్రంప్ కరోనా..!
X
Highlights

మళ్లీ పెరగనున్న బంగారం ధరలు. ట్రంప్ కు కరోనా రావడానికి.. బంగారం ధరలకు ఏంటీ సంబంధం అంటే.

TRUMP GOLD : పండుగల సీజన్ వచ్చేస్తోంది. అయితే నగలు కొనుక్కుందామనుకున్న వారికి మాత్రం కష్టాలు తప్పడం లేదు. ఎందుకంటే బంగారం ధరలు ఆల్ టైం హైకి చేరాయి. రోజుకో కొత్త రికార్డ్ క్రియేట్ చేస్తున్నాయి. సామాన్యులైతే బంగారం వైపు చూడాలంటేనే భయపడుతున్నారు.

కరోనా టైంలోనూ విపరీతంగా పెరిగిన బంగారం ధరలు.. ఇప్పుడు దిగి వస్తున్నాయి. ఇప్పుడు బంగారం రేటు భారీగానే తగ్గింది. ఆగస్ట్ నెల గరిష్ట స్థాయితో పోలిస్తే బంగారం ధర రూ.5,000కు పైగా పడిపోయింది. అలాగే కేవలం సెప్టెంబర్ నెల వరకు మాత్రమే చూస్తే బంగారం ధర దాదాపు రూ.1,500 పతనమైంది. మరోవైపు వెండి కేజీకి రూ.7,700 పతనమైంది.

ఇన్ని రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు ఇప్పుడు ఒక్కసారిగా పెరిగే అవకాశం కనిపిస్తోంది. దీనికి ఓ ఆసక్తికరమైన కారణం ఉంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు కరోనా రావడంతో బంగారం ధరలకు మళ్లీ రెక్కలొచ్చే అవకాశముందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.

ట్రంప్ కు కరోనా రావడానికి.. బంగారం ధరలకు ఏంటీ సంబంధం అంటే.. ట్రంప్ కు(TRUMP GOLD) కరోనా రావడంతో.. అమెరికా స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. దీని ఎఫెక్ట్ ఇతర మార్కెట్లపైనా పడింది. ఈక్విటీ మార్కెట్లు పడిపోవడంతో ఇన్వెస్టర్లు వారి డబ్బులను మార్కెట్ల నుంచి తీసేసి బంగారంలో ఇన్వెస్ట్ చేస్తారు. దీంతో బంగారం ధర మళ్లీ పైకి కదిలే అవకాశముందని ఎక్స్ పర్ట్స్ చెబుతున్నారు.

హైదరాబాద్ మార్కెట్‌లో శనివారం బంగారం ధర పెరిగింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.120 పెరుగుదలతో రూ.52,760కు చేరింది. అదేసమయంలో 22 క్యారెట్ల బంగారం ధర కూడా 10 గ్రాములకు రూ.120 పెరిగింది. దీంతో ధర రూ.48,370కు చేరింది. బంగారం ధర పెరిగితే.. వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది. కేజీ వెండి ధర రూ.500 పరుగులు పెట్టింది. దీంతో వెండి ధర రూ.61,200కు చేరింది.

TRENDING VIDEO :

[embed]https://youtu.be/T5iFk3bF2MU[/embed]

Read Also :

Next Story
Share it