Top
Batukamma

Gold Rates Today In Hyderabad : ఆల్ టైం హై కి చేరిన బంగారం

Gold Rates Today In Hyderabad : ఆల్ టైం హై కి చేరిన బంగారం
X
Highlights

Gold Rates Today In Hyderabad : బంగారం ధర ఆగడం లేదు. రోజు రోజుకు భారీగా పెరిగిపోతూనే ఉంది. వరుసగా పదోరోజు...

Gold Rates Today In Hyderabad : బంగారం ధర ఆగడం లేదు. రోజు రోజుకు భారీగా పెరిగిపోతూనే ఉంది. వరుసగా పదోరోజు బంగారం ధరలు పెరిగాయి. అమెరికా-చైనా టెన్షన్స్, కరోనా వైరస్ ఎఫెక్ట, గ్లోబల్ మార్కెట్ లో బంగారం ధరలు పెరగడంతో ధరలకు మరోసారి రెక్కలొచ్చాయి.

అంతర్జాతీయ మార్కెట్ లో బంగారం ధర పెరిగింది. ఔన్స్ బంగారం 1.49 శాతం పెరిగింది. దీంతో ఔన్స్ ధర 1971 డాలర్లకు చేరింది. వెండి ఔన్స్ 5.41 శాతం పెరిగి 24.62 డాలర్లకు చేరింది.

హైదరాబాద్ లోనూ బంగారం ధరలు చుక్కలనంటాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.220 పెరిగింది. ప్రస్తుతం 55,820కి చేరింది. ఇది ఆల్ టైం హై ధర. 22 క్యారెట్ల బంగారం ధర కూడా పెరిగింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం 220 రూపాయలు పెరిగింది. దీంతో 10 గ్రాముల ధర 51,250 రూపాయలకు చేరింది.

GOLD

వెండి కూడా బంగారం బాటలోనే పయనిస్తోంది. కిలో వెండిపై 2 వేల రూపాయలు పెరిగింది. దీంతో కిలో వెండి ధర 65000కు చేరింది. వెండి పారిశ్రామిక వినియోగం పెరగడమే దీనికి కారణంగా తెలుస్తోంది.

ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 400 పెరిగి 52,200కు చేరింది. 24క్యారెట్ల బంగారం 200 రూపాయలు పెరిగి 53,200 రూపాయలకు చేరింది.

Next Story
Share it