Top
Batukamma

Greatness of RGV : వర్మ లాంటి డైరెక్టర్ నెవర్‌ బిఫోర్‌ ఎవర్‌ ఆఫ్టర్‌ అంతే..!

Greatness of RGV : వర్మ లాంటి డైరెక్టర్ నెవర్‌ బిఫోర్‌ ఎవర్‌ ఆఫ్టర్‌ అంతే..!
X
Highlights

Greatness of RGV : వర్మ..తను తీసే సినిమాల్ని ఎంత తిట్టుకున్నాగానీ తన టాలెంట్ని మాత్రం మెచ్చుకునేలా చెయ్యగల....

Greatness of RGV : వర్మ..తను తీసే సినిమాల్ని ఎంత తిట్టుకున్నాగానీ తన టాలెంట్ని మాత్రం మెచ్చుకునేలా చెయ్యగల. కెపాసిటీ వర్మకొక్కడికే సాధ్యమనుకుంటా..

సినిమా పరిశ్రమ ఒక ఒరవడిలో పోతున్న ప్రతీసారి ఊరంతా ఒకదారి ఉలిపికట్టెదొక దారి అని కొత్తాపంథాని చూపెడుతూనే ఉన్నాడు.. ఫార్ములా కథల మధ్య శివ లాంటి స్టడీ కామ్ సినిమాల్ని, ఫ్యామిలీ ఎంటర్టైనర్ల మధ్య క్షణక్షణంలాంటి రోడ్ ఛేజ్ థ్రిల్లర్లని ఇచ్చాడు.. హారర్ సినిమా అంటే హోరెత్తించే నేపథ్యసంగీతం, తెల్లచీర కట్టుకున్న కథానాయిక ఖచ్చితంగా ఉండాలనుకునే తరానికి 'రాత్రి' లాంటి న్యూ ఏజ్ ఎక్స్పీరియన్స్ అందించి ఎంతోమంది ఆలోచనల్ని అయస్కాంతంలా ప్రభావితం చేసిన మార్గదర్శి..

సరే.. సాధారణంగా ఎంతటి దిగ్దర్శకులైనా, రచయితలైనా బ్రహ్మాండమైన సినిమాలు అందించాకా కొంతకాలానికి స్టాక్ అయిపోయి ఎక్కడొకచోట స్టక్ అయిపోతుంటారు.. క్రియేటివ్ ఫీల్డ్లో అత్యంత సహజం ఈ సరుకు అడుగంటడమనేది.. అట్లాగే ఆర్జీవీ సమకాలీన దర్శకులంతా ఎప్పుడో ఫేడ్ఔట్ అయిపోయారు ఒక్క ఆర్జీవీ తప్ప.. ఆఖరికి వర్మ దగ్గర శిష్యరికం చేసిన ఆణిముత్యాలనదగ్గ దర్శకులు సైతం ఫేడవుట్ ఐపోయారేమోగాని ఆర్జీవీ మాత్రం పరుగు ఆపట్లేదు..

కెరీర్ ప్రారంభించి ముప్పైయేళ్ళు గడుస్తున్నా, తీసేది ఎంత చెత్తయినా ఆఫర్లకి కొదవలేదు.. తీసేవాళ్ళు తీస్తూనే ఉన్నారు.. హీరోయిన్లు తన చుట్టూ మూగుతూనే ఉన్నారు..

ఏంటి తన బలం..??

ఉద్యోగమైనా, వ్యాపారమైనా అప్టూడేట్ గా ఉండటం అనేది చాలా అవసరం.

అది ఆర్జీవీలో పుష్కలం..

స్కిల్స్ పరంగా చూస్తే నిస్సందేహంగా ఎవ్వరికీ అందనంత ఎత్తులో ఉంటాడు.. తన తోటి తరమంతా అహంకారంతోనో, మూర్ఖత్వంతోనో లేక సంశయంతోనో కొత్తమార్పుల్ని అంగీకరించలేక, ప్రతిభకు పదును పెట్టుకోక అక్కడే ఆగిపోతుంటే వర్మ మాత్రం తనని తాను అప్టూడేట్ చేసుకుంటూ కాలంతోపాటు పరిగెత్తాడు.. విచ్చలవిడిగా బతకడం కూడా అప్డేటేనా అని రాళ్లేసే జనాన్ని పట్టించుకోనని ఎప్పుడో గ్లాస్ బద్దలుకొట్టాడు..

థగ్ లైఫ్ చూసేశాడు.. తరాల్ని ఇన్స్పైర్ చేశాడు.. దేనికీ వెరవకుండా నచ్చినట్టు బ్రతకడమనే భావజాలాన్ని తన భక్తుల్లో అణువణువూ నింపాడు.. ఎవరైనా పబ్లిగ్గా తిడదామనుకున్నా సరే ఎందుకొచ్చిన పెంటలే అని వెనక్కి తగ్గే భయాన్ని కలిగించాడు..

వేరే దర్శకులెవరూ కనబడరు మనకిలా..

ఇప్పుడొచ్చే దర్శకులు సైతం ఇన్స్పిరేషన్గా తీసుకోదగ్గ శైలి, వందమందిని ప్రఖ్యాత జర్నలిస్టుల ముందు కూర్చోబెట్టినా తడుముకోకుండా సమాధానాలు చెప్పే సామర్ధ్యం, మాట్లాడేది తప్పైనా ఒప్పయినా లాజిక్తో కొట్టే సత్తా, మనకి మామూలుగా అనిపించే వార్తల ముఖ్యాంశాలతో సబ్జెక్టుల్ని అల్లేసే ప్రతిభ, అవసరమైతే ఐ ఫోన్తో కూడా సినిమాని తీసేసే నేర్పు, టాలెంట్ ఎక్కడున్నా క్షణాల్లో దగ్గరికి లాగేసే నెట్వర్క్, కథ లేకుండా కేవలం మూడు నాలుగు సన్నివేశాలతో సినిమా తీసిపారేసి వాటినే ట్రయిలర్లో చూపించి అందరిలో ఆసక్తి రేకెత్తించి గంటలో రాష్ట్రమంతా మాట్లాడుకునేలా చెయ్యగల టాలెంట్.. ఇలా వేరే ఎవరుచేసినా జనం కన్నెత్తి కూడా పట్టించుకోరు.. ఆర్జీవీ ముఖసిరి అంతే..!!

ప్రస్తుతం హీరోలు, దర్శకులు గంతలు కట్టుకుని అనుమతుల కోసం ముఖ్యమంత్రుల చుట్టూ తిరుగుతుంటుంటే తను మాత్రం యే క్షణానికి ఎక్కడుంటాడో కూడా తెలీకుండా చకచకా మూడు సినిమాలు తీసిపారేసి కాసులు చేసుకున్నాడు.. థియేటర్ల గుమ్మంతో పనిలేకుండా నెట్టింట్లో రిలీజ్ చేసి కూడా డబ్బులు చేసుకోవచ్చని కొత్తదార్లు చూపించాడు..

ఈ తెలివితేటల్ని గనుక సక్రమంగా వినియోగిస్తే అద్భుతాలు చెయ్యొచ్చు.. కానీ చేయడు.. అదేంటీ అంటే దటీజ్ వర్మ..!! ఇంకేమంటాం..?

నిన్న విడుదల చేసిన పవర్ స్టార్ సినిమా ఆఖర్లో వర్మ ఓ డైలాగ్ అంటాడు..

"మేథస్సుని నిచ్చెగా వాడుకుంటూ పైకి ఎక్కుతున్నప్పుడు నిచ్చెనలో ఒక్కో మెట్టుని అక్కడే వదిలేసి వెళ్లిపోవాలి తప్ప ఆ మెట్టుని భుజాన వేసుకుని రావాలనుకోకూడదు.. లేదంటే ఆ బరువుకి పడిపోతాం అని.."

ఇదేనేమో అతను ఫాలో అయ్యేది..

Haribabu Maddukuri

Next Story
Share it