Top
Batukamma

ఇలాంటి ప్రధాని నెవర్‌ బిఫోర్‌.. ఎవర్‌ ఆఫ్టర్‌!

ఇలాంటి ప్రధాని నెవర్‌ బిఫోర్‌.. ఎవర్‌ ఆఫ్టర్‌!
X
Highlights

హలో తమ్ముడు...!!!బిగ్ బాస్ షో గురించి నీకంటే ఎక్కువ ఎవరికి తెలీదు. IPL గురించి అయితే నిన్ను మించిన తోపు...

హలో తమ్ముడు...!!!

బిగ్ బాస్ షో గురించి నీకంటే ఎక్కువ ఎవరికి తెలీదు. IPL గురించి అయితే నిన్ను మించిన తోపు లేడు.

కానీ ఈ దేశంలో ఒక నిస్వార్ధపరుడు ఉండేవాడు ఆయన గురించి కూడా తెలుసుకో కొంచెం.

ఆయన 1956లో రైల్వే శాఖ మంత్రిగా ఉన్నప్పుడు, ఒక బ్రిడ్జి కొట్టుకపోయి, ట్రైన్ పట్టాలు తప్పి కొంత మంది ప్రయాణికులు ప్రమాదంలో చనిపోతే, దానికి నైతిక బాధ్యత తీసుకొని తన పదవికి రాజీనామా చేసాడు.

1962లో చైనాతో జరిగిన యుద్ధంలో మనం ఓడిపోయి, ప్రపంచంలో మన కీర్తి మసకబారుతుంటే, 1965లో పాకిస్తాన్ వాడు యుద్ధం చేస్తే... ఓ పక్కా ఆహార కొరత ఇంకో పక్కా యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న సమయంలో "జై జవాన్ - జై కిసాన్" అనే నినాదం ఇచ్చి...

దేశాన్ని ముందుకు నడిపించి. ఆ యుద్ధంలో పాకిస్తాన్ని తుక్కు తుక్కు ఓడించి. TASKENT లో యుద్ధ విరమణ(కాల్పుల విరమణ) CEASE FIRE AGREEMENT చేసుకుని. తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయాడు.

ప్రధానిగా ఉండి కూడా సొంత కార్ కొనుకోవడానికి లోన్ తీసుకున్న వ్యక్తి. సొంత పనికి కనీసం ఆఫీసులో పెన్ అండ్ పేపర్ కూడా ఉపయోగించేవాడు కాదంట. అందుకే కావొచ్చు ఆయన్ని అందరూ మర్చిపోయారు.

ఒకటిన్నర సంవత్సరాలు ప్రధానమంత్రిగా ఉన్నప్పటికీ దేశానికి ఎన్నో సేవలు చేశాడు.

Greatness Of Lal Bahadur Shastri

Next Story
Share it