Groom Escaped From Marriage : ఇష్టం లేని పెళ్లి... కరోనా సోకిందంటూ ప్రచారం!

Groom Escaped From Marriage : తనకి ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారంటూ ఓ వ్యక్తి ఆ పెళ్లి నుంచి...
Groom Escaped From Marriage : తనకి ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారంటూ ఓ వ్యక్తి ఆ పెళ్లి నుంచి తప్పించుకునేందుకు స్వంతంగా కరోనా సోకిందంటూ ప్రచారం చేసుకున్నాడు. ప్రస్తుతం క్వారంటైన్లో ఉన్నానంటూ బంధువులకు ఫోను ద్వారా చెప్పి వివాహానికి రద్దు అయ్యేలా చేశాడు.
ఈ ఘటన చెన్నేకొత్తపల్లి మండలం కనుముక్కల గ్రామంలో చోటు చేసుకుంది. ఇక వివరాల్లోకి వెళ్తే.. స్థానికుల కథనం మేరకు.. నరసింహులు, నరసమ్మల పెద్ద కొడుకు రామ్‌కుమార్ (రాముడు)కి అదే మండల కేంద్రానికి చెందిన ఓ యువతీతో శనివారం రాత్రి పెళ్లి ఖరారు అయింది.
- Anasuya White Saree Pics : వైట్ సారీలో దగదగ మెరుస్తున్న అనసూయ!
- Delhi Rape : ఢిల్లీలో మరో నిర్భయకాండ.. ఎంత దారుణమంటే…
ఇష్టం లేని పెళ్లి కావడంతో రామ్‌కుమార్ శుక్రవారం రాత్రే ఇంటినుంచి ఎవరికీ చెప్పకుండా బయటకు వచ్చాడు. ఆ తర్వాత తనకు కరోనా సోకిందని, తనను అనంతపురం నారాయణ కాలేజీలోని క్వారంటైన్‌కు తరలించారని అంటూ నాటకం మొదలుపెట్టాడు. ఇదే విషయాన్నీ బంధువులు, మిత్రులకి తెలిపాడు.
- Shivathmika Struggles : సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్న రాజశేఖర్ కూతురు..!
- AMAZON PRIME DAY 2020 : అదిరే ఆఫర్లతో అమెజాన్ ప్రైమ్ డేస్ వచ్చేశాయ్
అయితే దీనిపైన అధికారులు చివరగా వవివరణ ఇవ్వగా తాము రామ్‌కుమార్ అనే వ్యక్తిని తాము ఎక్కడికి తీసుకెళ్లలేదని క్లారిటీ ఇచ్చారు. అయితే చివరికి నిజం చెప్పక తప్పలేదు.. పెళ్లి ఇష్టంలేకనే రామ్ కుమార్ ఈ నాటకం ఆడినట్లుగా వెల్లడించాడు.