Top
Batukamma

ఈ నెల 15 నుంచి స్కూళ్లు.. గైడ్ లైన్స్ ఇవే!

ఈ నెల 15 నుంచి స్కూళ్లు.. గైడ్ లైన్స్ ఇవే!
X
Highlights

దేశంలో స్కూళ్లు తెరిచేందుకు కేంద్ర విద్యాశాఖ గైడ్ లైన్స్ రిలీజ్ చేసింది. ఈ నెల 15 నుంచి స్కూళ్లు, కోచింగ్...

దేశంలో స్కూళ్లు తెరిచేందుకు కేంద్ర విద్యాశాఖ గైడ్ లైన్స్ రిలీజ్ చేసింది. ఈ నెల 15 నుంచి స్కూళ్లు, కోచింగ్ సెంటర్లు తెరవొచ్చని.. అయితే.. దీనిపై రాష్ట్ర ప్రభుత్వాలే నిర్ణయం తీసుకోవాలని చెప్పింది. కరోనాకు సంబంధించి కేంద్ర హోంశాఖ, ఆరోగ్యశాఖ ఇచ్చిన గైడ్ లైన్స్ ను ఖచ్చితంగా పాటించాలని ఆదేశించింది.

స్కూళ్లలోని క్లాస్ రూంలతో పాటు.. అన్ని ప్రాంతాలను ఎప్పటికప్పుడు శానిటైజ్ చేయాలని సూచించింది. క్లాస్ రూముల్లో గాలి ప్రసరణ ఎక్కువగా ఉండేలా చూడాలంది. ఫిజికల్ డిస్టెన్స్ ఉండేలా సీటింగ్ లో మార్పులు చేయాలని చెప్పింది. అలాగే.. స్కూళ్లకు వచ్చే విద్యార్థులు, ఉపాధ్యాయులకు వైద్యపరీక్షలు చేయాలని చెప్పింది.

రక్షణ, ఇతర సహాయ చర్యల కోసం స్కూళ్లలో ప్రత్యేక టీంలు ఏర్పాటు చేయాలని.. నర్సు గానీ, డాక్టర్ ను గానీ అందుబాటులో ఉంచుకోవాలని ఆదేశాలిచ్చింది. స్కూళ్లలో ఎలాంటి ఈవెంట్లు, ఫంక్షన్లు చేయొద్దని చెప్పింది.

..

స్కూళ్లలో తీసుకుంటున్న ప్రికాషన్స్ గురించి తల్లిదండ్రులకు తెలియజేయాలన్నారు. పిల్లలు స్కూలుకు వచ్చేందుకు వారి తల్లిండ్రుల నుంచి రాతపూర్వక అంగీకారం తీసుకోవాలని సూచించారు. అటెండెన్స్ విధానంలోనూ మార్పులు చేయాలన్నారు. అనారోగ్యంగా ఉన్న విద్యార్థులు, టీచర్లు ఇళ్లలోనే ఉండేందుకు అవకాశం ఇవ్వాలన్నారు.

విద్యార్థులు ఆన్ లైన్ క్లాసులు గానీ, స్కూలుకు రావడం గానీ.. ఏ విధానంలో అయినా క్లాసులు వినే అవకాశం కల్పించాలన్నారు. అనారోగ్యంగా ఉంటే ఇళ్లలోనే ఉండేలా సిక్ లీవ్ విధానం అమలు చేయాలి. మధ్యాహ్న భోజన విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలని విద్యాశాఖ ఆదేశించింది. పిల్లలకు మంచి ఆహారం ఇవ్వాలని.. అది కూడా వేడిగా ఉన్నప్పుడే వడ్డించాలని చెప్పింది. అలా కాకపోతే దానికి సరిపడా ఫుడ్ సెక్యూరిటీ అలయెన్స్ ఇవ్వాలని సూచించింది.

..

విద్యార్థులపై భారం పడకుండా కొత్త అకడమిక్ క్యాలెండర్ తయారు చేయాలని విద్యాశాఖ సూచించింది. విద్యా విధానం లెర్నర్ ఫ్రెండ్లీగా ఉండాలని గైడ్ లైన్స్ లో ఆదేశించింది. పరీక్షల నిర్వహణ విషయంలోనూ విభిన్న పద్ధతులు పాటించాలంది.

Next Story
Share it