Hathras Accused : హత్రాస్ కేసులో మరో ట్విస్ట్..!

బాధితురాలి చనిపోయే ముందు ఇచ్చిన వాంగ్మూలంలో తనపై లైంగికదాడి జరిగిందని చెప్పింది.
Hathras accused letter to police : హత్రాస్ కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు బయటకు వస్తున్నాయి. యువతి చనిపోయిన కొద్ది రోజులకే అసలు అత్యాచారమే జరగలేదని పోలీసులు చెప్పారు. పోస్ట్ మార్టమ్, ఫోరెన్సిక్ రిపోర్టుల్లో ఎలాంటి ఆధారాలు లభించలేదన్నారు.
ఇవన్నీ నడుస్తుండగానే.. లెటెస్ట్ గా హత్రాస్ ఎస్పీకి నిందితులు లేఖ రాశారు. ప్రస్తుతం జైలులో ఉన్న నలుగురు నిందితులు పోలీసులకు లెటర్ రాశారు. లెటర్ లో నలుగు నిందితులు సందీప్, లవకుష్, రవి, రాము సంతకాలున్నాయి. ఇందులో విషయాలు మరింత ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి.
బాధితురాలితో తనకు ముందు నుంచి పరిచయం ఉందని లెటర్ లో రాశాడు ప్రధాన నిందితుడు సందీప్(Hathras Accused ). చాలాకాలంగా ఫోన్ లో మాట్లాడుకుంటున్నామని రాశాడు. అయితే ఎప్పుడూ డైరెక్ట్ గా కలవలేదన్నాడు. ఈ విషయంలో వారి ఫ్యామిలీ కూడా తెలుసునన్నాడు.
ఘటన జరిగిన రోజు ఏం జరిగిందో కూడా వివరించాడు సందీప్. అమ్మాయిని కలిసేందుకు పొలం దగ్గరకు వెళ్లానని.. అప్పటికే అక్కడ ఆమె తల్లి, సోదరుడు ఉన్నారని రాశాడు. దీంతో తనను వెళ్లిపోవాలని అమ్మాయి చెప్పిందని.. తాను అక్కడి నుంచి ఇంటికి వచ్చేశానని చెప్పాడు.
అయితే.. ఈ విషయం గుర్తించిన ఆమె తల్లి, సోదరుడు ఆమెను తీవ్రంగా కొట్టి, ప్రాణాపాయ స్థితిలో పడేసి వెళ్లారని నిందితులు లెటర్ లో రాశారు. తమకు ఎలాంటి పాపం తెలియదని.. అన్యాయంగా ఇరికించారని.. తమను విడిపించాలని కోరారు.
అయితే.. దీనిపై కాంగ్రెస్ పార్టీ నేషనల్ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. బాధితురాలి కుటుంబానికి న్యాయం చేయాల్సింది పోయి... ఆమె క్యారెక్టర్ చెడ్డదని ముద్ర వేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.
నిందితుల లేఖపై బాధితురాలి ఫ్యామిలీ కూడా రియాక్ట్ అయ్యింది. వారు చెప్పినవన్నీ అబద్దాలేనని కుటుంబసభ్యులు చెప్పారు.
ఇక.. బాధితురాలి చనిపోయే ముందు ఇచ్చిన వాంగ్మూలంలో తనపై లైంగికదాడి జరిగిందని చెప్పింది. దీనికి సంబంధించి పోలీసుల దగ్గర వీడియో రికార్డింగ్ కూడా ఉంది. (వాంగ్మూలంలో ఏముందో చూసేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.)
READ ALSO :
- యోగా కోసం వస్తే రేప్ చేశాడు..!
- ఈ ప్యాడ్స్ పట్టుకోవద్దని మీ కొడుకుని హెచ్చరించకండి
- ఖమ్మంలో మరో హత్రాస్ ఘటన!
- తెలంగాణ విద్యార్థులు, తల్లిదండ్రులకు గుడ్ న్యూస్..!
- అత్తింటి వేధింపులకు “అల్లుడు బలి”..!
- సెగలు పుట్టిస్తున్న సీరియల్ నటి!
- జగనన్న అభిమానులు క్షమించండి.. ఇంకెప్పుడు ఇలా చేయను!
- దళిత ఎమ్మెల్యేతో కూతురు పెళ్లి.. బ్రాహ్మణ మామ సూసైడ్ అటెంప్ట్!
- ADHIRINDI SHOW : నాగబాబు,శ్రీముఖికి శ్రద్ధాంజలి..! ఇంతకీ ఏంజరిగింది..?
- Kajal Wedding : కాజల్ పెళ్లి చేసుకోబోతున్న వ్యక్తి ఎవరంటే..?
- Anchor Bhanu sri : భానుశ్రీలో ఈ హాట్ యాంగిల్ చూశారా..?
- batkamma batukamma songs Breaking News google news Hathras hathras accused hathras accused girl&x27;s friend hathras accused letter hathras accused letter to police hathras accused write letter Hathras case Hathras Case News Hathras news india బతుకమ్మ హత్రాస్ ఘటన హత్రాస్ నిందితుల లెటర్ హత్రాస్ బాధితురాలు