Hathras DM : హత్రాస్ బాధితురాలి ఫ్యామిలీకి కలెక్టర్ బెదిరింపు..!

ఇవాళ కొంత మీడియా వెళ్లిపోయింది.. రేపు మరికొంత మీడియా వెళ్లిపోతుంది.. మేం మాత్రం మీతోనే ఉంటాం. మీ స్టేట్ మెంట్ మార్చుకుంటారా.? లేదా
Hathras DM for threatening victim's father : ఉత్తరప్రదేశ్ లోని హత్రాస్ లో ఓ యువతిని నలుగురు యువకులు దారుణంగా మానభంగం చేసి చంపేశారు. ఈ ఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. అపోజిషన్ పార్టీలు, దళిత సంఘాలు ఆందోళనా బాట పట్టాయి.
విషయం సీరియస్ గా మారడంతో అధికారులు ఇప్పుడు ఆ యువతి ఇంటికి క్యూ కట్టారు. అయితే.. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు బాధితురాలి కుటుంబానికి అధికారులు అండగా ఉండాలి. వారికి రక్షణ కల్పించాలి.
- ఈ అత్యాచార కేసు విన్నాక, రక్తం మరగకపోతే వాడు మనిషే కాదు!
- వెన్నులో వణుకు పుట్టించావ్ … కామమా నీకు వందనం!
కానీ హత్రాస్ ఘటనలో మాత్రం ఏకంగా జిల్లా కలెక్టర్(Hathras DM) మీదే ఆరోపణలు వస్తున్నాయి. బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన హత్రాస్ కలెక్టర్ ప్రవీణ్ కుమార్.. వారిని బెదిరించారంటూ ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
“ఇవాళ కొంత మీడియా వెళ్లిపోయింది.. రేపు మరికొంత మీడియా వెళ్లిపోతుంది.. మేం మాత్రం మీతోనే ఉంటాం. మీ స్టేట్ మెంట్ మార్చుకుంటారా.? లేదా అనేది మాత్రం మీ ఇష్టం అంటూ ఆయన వార్నింగ్ ఇచ్చినట్టు వీడియోలో ఉంది. ఇప్పుడు ఇది మరో దుమారం రేపుతోంది.
[embed]https://www.youtube.com/watch?v=T2bryI1Lejc&feature=youtu.be[/embed]
- atukamma Batukamma.com Cremation Hathras HATHRAS DISTRICT MAGISTRATE Hathras DM for threatening victim's father HATHRAS DM PRAVEEN Hathras Gang Rape Hathras gangrape hathras gangrape case Hathras gangrape victim cremation Hathras Horror Hathras last rites Hathras rape case JusticeForManisha Manisha Valmiki Safdarjung Hospital Shocks India Today news Agra UP police Uttar Pradesh Uttar Pradesh police