Top
Batukamma

దారుణం : ఫ్యామిలీని బంధించి అర్ధరాత్రి మనిషా అంత్యక్రియలు!

దారుణం : ఫ్యామిలీని బంధించి అర్ధరాత్రి మనిషా అంత్యక్రియలు!
X
Highlights

Hathras Gang Rape : ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్‌లో సామూహిక అత్యాచార ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి...

Hathras Gang Rape : ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్‌లో సామూహిక అత్యాచార ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.. 19 ఏళ్ల మనిషావాల్మీకి అనే అమ్మాయిని అదే గ్రామంలోని నలుగురు యువకులు నిర్బంధించి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.. ఎక్కడ ఆమె పేరు చెబుతుందో అని భయపడి నోరు కోశేశారు.. వెన్నుమక పైన దాడి చేశారు.

ఏమీ చేయని నిస్సహాయ స్థితిలో ఉన్న మనిషాని ఆమె కుటుంబ సభ్యులు ఢిల్లీలోని సఫ్దార్జంగ్ ఆసుపత్రిలో చేర్చగా , అక్కడ ఆమె చికిత్స పొందుతూ నిన్న ( మంగళవారం) మృతి చెందింది. మరో నిర్భయ, దిశా లాంటి సంఘటన చోటుచేసుకోవడంతో ఆసుపత్రి బయట, దేశవ్యాప్తంగా నిందితులను బహిరంగంగా కాల్చి చంపేయాలన్న డిమాండ్లు మొదలయ్యాయి.. అటు యూపీ ప్రభుత్వం పైన కూడా విపక్షాలు విరుచుకుపడుతున్నాయి..

8clrusvo

భారీ పోలీసుల మోహరింపుల మధ్య మంగళవారం రాత్రి సఫ్దర్‌జంగ్ ఆసుపత్రి నుంచి రాత్రి 9.30 గంటలకు మృతదేహం హత్రాస్‌ కి చేరుకుంది. అయితే మృతదేహం రావడం కంటే ముందే హత్రాస్‌కు చేరుకున్న ఉత్తరప్రదేశ్ పోలీసులు చివరి కర్మలను వెంటనే నిర్వహించాలని కుటుంబ సభ్యులను, గ్రామస్తులను కోరారు.. దీనికి బాధితురాలు తండ్రి ఒప్పుకోలేదు.. హిందూ సంప్రదాయం ప్రకారం ఇది విరుద్ధమని పోలీసులను వేడుకున్నాడు..

మృతదేహాన్ని ఇంటికి తీసుకువెళ్ళి.. ఉదయం దహన సంస్కారాలకు అనుమతి ఇవ్వాలని కోరాడు.. బాధతురాలు తల్లి కూడా పోలీసులను వేడుకుంది. అక్కడికి పోలీసులు కూడా భారీగా మోహరించడంతో ఏమీ చేయలేని పరిస్థితి నెలకొంది. కనీసం అంత్యక్రియల దగ్గరికి కూడా ఎవరిని రానివ్వలేదు.. మొత్తం గ్రామాన్ని తమ అదుపులోకో తీసుకున్నారు పోలీసులు . కింది వీడియోలో ఈ విషయాలను గమనించవచ్చు)

https://www.youtube.com/watch?v=AgOKvLe0q34&feature=youtu.be

అయినప్పటికీ పోలీసులు వినకుండా వారిని నిర్బంధించి తెల్లవారుజామున 2:30 గంటల సమయంలో పోలీసులు మృతదేహాన్ని దహనం చేశారు. మనిషా చివరి చూపును కూడా చూడనివ్వకుండా బలవంతగా అంత్యక్రియలు చేశారని బాధితురాలు బంధువులు, కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా దహన సంస్కారాలను అడ్డుకునందుకు గాను పోలీసులు కొట్టారని వారు అంటున్నారు. అటు గ్రామస్తులు కూడా పోలిసుల తీరు పైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

అయితే దీనిని పోలీసులు మాత్రం ఖండిస్తున్నారు. కుటుంబ సభ్యుల సమ్మతి మేరకు మేము దహన సంస్కారాలు చేసామని, కుటుంబ సభ్యులు కొందరు దహన సంస్కారాలకు హాజరయ్యారని వారు అంటున్నారు. మీడియాలో వస్తున్న కథనాలు అవాస్తవం అని జిల్లా మేజిస్ట్రేట్ ప్రవీణ్ కుమార్ లక్ష్కర్ అన్నారు.

0k7c5lvo

Next Story
Share it