Top
Batukamma

Hathras Victim : హాత్రాస్ బాధితురాలి మరణ వాంగ్మూలం..!

Hathras Victim : హాత్రాస్ బాధితురాలి మరణ వాంగ్మూలం..!
X
Highlights

ఆమె: (గట్టిగా స్పష్టంగా) ఎందుకా? నన్ను బలత్కారం చెయ్యనివ్వనందుకు.. (క్యో.. మైనె జబర్దస్త్ నహీ కర్నె ది) మగ గొంతు: అచ్చా... ఎలా గొంతు పిసికాడు?

Hathras victim audio tape from hospital : హత్రాస్ లో యవతిపై అత్యాచారం ఘటన దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారింది. అయితే.. అసలు యువతిపై అత్యాచారమే జరగలేదంటోంది యూపీ సర్కారు. ఫోరెన్సిక్ రిపోర్ట్ లో ఎలాంటి ఆధారాలు లభించలేదని చెబుతోంది. కానీ యువతి హాస్పిటల్ లో ఉండగా ఇచ్చిన వాంగ్మూలంలో మాత్రం.. తనపై అత్యాచారం జరిగిందని చెప్పిందని పోలీసులే చెప్పారు. అయితే.. పోలీసులు బాధితురాలితో మాట్లాడినట్టుగా చెబుతున్న్ ఓ సంభాషణ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అది Prasad Charasala ఫేస్ బుక్ వాల్ నుంచి...

..

హత్రాస్ రేప్ బాధితురాలు వీడియో టేపుల్లో చెప్పిన వివరాలు.

టేప్-1

ఆమె(Hathras Victim ): వాడు నా గొంతు నులిమాడు. (నొప్పిని భరిస్తూ..)

పక్కన మగ గొంతు: ఎవరు?

ఆమె: (నొప్పితో మూలుగు)

మగ గొంతు: ఎందుకు నీ గొంతు నులిమారు?

ఆమె: బలాత్కారం చెయ్యనివ్వనందుకు. (జబర్దస్త్ నహీ కర్నే దీ)

మగ గొంతు: ఎందుకు గొంతు నులిమారో చెప్పు.

ఆమె: (గట్టిగా స్పష్టంగా) ఎందుకా? నన్ను బలత్కారం చెయ్యనివ్వనందుకు.. (క్యో.. మైనె జబర్దస్త్ నహీ కర్నె ది)

మగ గొంతు: అచ్చా... ఎలా గొంతు పిసికాడు?

మరో ఆడ గొంతు: ఎలా గొంతు పిసికాడో చెప్పు?

ఆమె: చేతులతో

మరో మగ గొంతు: ఇంకెక్కడైనా గాయాలయ్యాయా?

ఆమె: కాదు..నా గొంతులో.. (గొంతు బాధ గురించి ఇంకా ఏదో చెప్పడానికి ప్రయత్నం)

మరో ఆడ గొంతు: నాలుక చూపించు

టేప్-2:

ఆమె: సందీపే (సందీప్ నె)

మగ గొంతు: ఏంటి?

ఆమె: సందీపే.

మగ గొంతు: ఎవరు?

ఆమె: సందీప్

మగ గొంతు: ఇంకా?

ఆమె: వాడే నా గొంతు నులిమాడు.

మగ గొంతు: దేన్ని పట్టించుకొని? (కిస్ బాత్‌కె లేకర్?)

ఆమె: ఏమీ లేదు. మేము గడ్డి తెచ్చుకుందామని వెళ్ళాం.

మగ గొంతు: మ్మ్

ఆమె: ఆ తర్వాత ... నన్ను లోపలికి తీసుకెళ్ళాడు.. గొంతు నులిమాడు.... బలాత్కారం చెయ్యడానికి ప్రయత్నించాడు... నేను పెనుగులాడా... నా గొంతు నులిమేశాడు ..అంతే.

మగ గొంతు: ఏమైనా జగడం నడుస్తూ వుండిందా?

అమె: అవును

ఆడ గొంతు (ఆమె తల్లి కావచ్చు): అవైతే వుండనే వున్నయి.

ఆమె: (వినపడలేదు)

మగ గొంతు:నీ పేరేంటి?

ఆమె: (తన పేరు చెప్పింది)

టేప్-3:(అసుపత్రిలో తీసినది)

ఆమె: (వినిపించలెదు)

ఆమె: మునుపూ ఒకసారి..

మగ గొంతు: మునుపు కూడా ఒకసారి రేప్ చెయ్యడానికి ప్రయత్నించారా?

ఆమె: హా..ఆ అన్నదమ్ములే.. (హా..వో భాయియో నె)

మగ గొంతు: ఇంతకు ముందా?

ఆమె: హా...

మగ గొంతు: అచ్చా.. దీనికి ముందు రేప్ చెయ్యడానికి ప్రయత్నించారా?

ఆమె: హా...

మగ గొంతు: మరేమయ్యింది?

ఆమె: నేనక్కడ్నుంచీ పారిపోయా.

మగ గొంతు: పారిపోయొచ్చావా? మళ్ళేమయ్యింది?

ఆమె: రవి నన్ను చూస్తూ "ఏమన్నా అయిందా?" అన్నాడు.

మగ గొంతు: ఏమన్నా అయిందా లేదా?

ఆమె: సందీప్‌ను అడుగు .. (రవిని ఉద్దేశించి సందీప్‌ను అడుగు అన్నాను అని)

మగ గొంతు: అచ్చా

ఆమె: "... ఫోన్ చేసి " (రవితో ఏమన్నదో చెబుతోంది..)

మగ గొంతు: అచ్చా

ఆమె: హా...

మగ గొంతు: రవి అడుగుతూవున్నాడా "ఏమన్నా అయిందా లేదా" అని?

ఆమె: అవును, అప్పుడర్థం అయింది, వారిద్దరూ పథకంలో భాగమని..

మగ గొంతు: అచ్చా

ఆమె: హా...

మగ గొంతు: వాళ్ళిద్దరూ కలిసే చేశారు?

ఆమె: హా...

మగ గొంతు: అప్పుడు బయట పడ్డావు. తర్వాతేమయ్యింది?

ఆమె: మళ్ళీ మొన్నయింది.

మగ గొంతు: మోన్న నువ్వు గాయపడ్డ రోజు, రేప్ అయ్యిందా?

ఆమె: హా...

మగ గొంతు: అచ్చా, వాళ్ళిద్దరేనా, ఇంకెవరైనా వున్నారా?

ఆమె: వాళ్ళిద్దరూ వున్నారు...ఇంక మిగిలినోళ్ళు పారిపొయ్యారు.

మగ గొంతు: అచ్చా, మిగిలినోళ్ళు పారిపోయ్యారా!

ఆమె: మా మమ్మీని చూసి...

మగ గొంతు: మమ్మీని చూసి పారిపొయ్యారా?

ఆమె: హా..

మగ గొంతు: మీరప్పుడు తెలివిలోనే వున్నారా?

ఆమె: కొద్దిగా తెలివుండింది

మగ గొంతు: కొద్దిగ తెలివిలోనే వున్నారు?

ఆమె: హా...

మగ గొంతు: మిమ్మల్ని రేప్ చేసారా? (తో రేప్ హువా హై ఆప్ కె సాత్?)

ఆమె: హా...

మగ గొంతు: ఆ తర్వాత ఏమయ్యింది?

ఆమె: తర్వాత మమ్మీ నోట్లో నీళ్ళు పోసింది, ఏమయింది అని అడగబట్టింది...

source: The Wire

Read Also :

Next Story
Share it