Top
Batukamma

ఆరోగ్యానికి అరటి.. ఎన్ని పోషకాలో..

banana benefits
X
Highlights

పెరిగే పిల్లలకు, వృద్ధులకు వ్యాధులనుంచీ కోలుకునే వారికి దీనిని సమర్థవంతమైన ఆహారౌషధంగా ఇవ్వవచ్చు.

banana benefits: మంచి కారణం కోసం ప్రపంచంలో ఎక్కువగా వినియోగించే పండ్లలో అరటిపండు ఒకటి. వాటిని తినడం వల్ల రక్తపోటు తగ్గుతుంది. మరియు క్యాన్సర్ మరియు ఉబ్బసం ప్రమాదాన్ని తగ్గించవచ్చు.

నేడు, అరటిపండ్లు కనీసం 107 దేశాలలో పండిస్తారు. ద్రవ్య విలువలో ప్రపంచంలోని ఆహార పంటలలో నాల్గవ స్థానంలో ఉన్నాయి. అమెరికన్లు ఆపిల్ మరియు నారింజ కలిపి కంటే ఎక్కువ అరటిపండ్లు తీసుకుంటారు.

అరటి పళ్లు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడం మరియు క్రమబద్ధతను ప్రోత్సహించడం. ఇది వారిలో కలిగే ఆరోగ్య ప్రమాదాలను కూడా తగ్గిస్తుంది.


అరటి పండులో నీటి శాతం కంటే ఘన పదార్థం శాతం ఎక్కువ. ఇవన్నీ శరీరాన్ని పోషించే పదార్థాలు కావటంతో దీనిని కేవలం పండుగానే కాకుండా ఆహారంగా సైతం వాడుకోవచ్చు.

నూట యాభై గ్రాముల మేక మాంసంలోను, సగానికి కోసిన కోడిగుడ్డులోను, నాలుగొందల గ్రాముల ఆవుపాలలోను ఎంత శక్తి ఉంటుందో అంత శక్తి కేవలం, ఒక మోస్తరు పొడవున్న అరటి పండులో ఉంటుంది.

పెరిగే పిల్లలకు, వృద్ధులకు వ్యాధులనుంచీ కోలుకునే వారికి దీనిని సమర్థవంతమైన ఆహారౌషధంగా ఇవ్వవచ్చు.

అరటి పండు పైనుండే దళసరి తోలు సూక్ష్మక్రిములను, విష పదార్థాలను అడ్డుకొంటూ, రక్షక కవచంగా పనిచేస్తుంది. దీనిని ప్రయాణాలలోను, ఇతర అనుచిత ప్రదేశాల్లోనూ నిర్భయంగా తినవచ్చు.

మధుమేహ రోగులు ఇతర పిండి పదార్థాలను తగ్గించుకోగలిగితే, అరటి పండును తినడంలో అభ్యంతరమేదీ లేదు. (ఒక మోస్తరు సైజున్న అరటిపండునుంచి సుమారు 100 క్యాలరీల శక్తి విడుదల అవుతుంది. కాగా మధుమేహం నియంత్రణలో ఉన్న వారికి, శారీరకావసరాలకు, రోజుకు సుమారు 1600 క్యాలరీల శక్తి అవసరం అవుతుంది. ఈ శక్తిని దృష్టిలో ఉంచుకొని అరటి పండును తీసుకోవటంలో తప్పులేదు).

అరటి పండులో కొవ్వు పదార్థం చాలా అల్పమోతాదులో ఉంటుంది. ఈ కారణంచేత దీనిని కామెర్లలోను, ఇతర కాలేయపు వ్యాధుల్లోను నిరభ్యంతరంగా వాడుకోవచ్చు. (కాలేయం వ్యాధిగ్రస్తమైనప్పుడు కొవ్వును జీర్ణంచేసే ఎంజైముల విడుదల తగ్గిపోతుంది.)


అరటి పండులో పొటాషియం మోతాదు చాలా ఎక్కువ. దీనిని కిడ్నీ ఫెయిల్యూర్‌లో వాడకూడదు. (ఈ వ్యాధిలో మూత్రపిండాలు పొటాషియంను సమర్థవంతంగా బయటకు విసర్జించలేవు. ఫలితంగా రక్తంలో పొటాషియం మోతాదు ప్రమాద భరితమైన స్థాయిలో పెరిగిపోతుంది. అరటి పండ్లు అధికంగా తింటే ఇది మరింత పెరుగుతుంది.)

ఆయుర్వేద సిద్ధాంతం ప్రకారం అరటి పండు కఫాన్ని పెంచుతుంది. దగ్గు, జలుబు, ఆస్త్మా వంటి కఫ ప్రధాన వ్యాధుల్లో దీనిని వాడటం మంచిది కాదు.

అరటి పండు తిన్న తర్వాత ఏలక్కాయ తింటే కఫ దోషం తగ్గుతుంది. లేదా అరటి పండు తినేటప్పుడు రెండు లవంగాలను గాని, మూడు మిరియాలను గాని గుజ్జుతోపాటు తిన్నా సరిపోతుంది.

పోషక విలువలు :

74% కన్నా ఎక్కువగా నీరు ఉంటుంది. 23% కార్బోహైడ్రేటులు, ~

1% ప్రోటీనులు,

2.6% ఫైబరు ఉంటుంది.

పూర్తిగా మాగిన అరటిలో 1-2% చక్కర ఉంటుంది. అరటిపండు మంచి(banana benefits) శక్తిదాయకమైనది. అంతే కాకుండా ఇందులో పొటాషియం కూడా ఉంటుంది. అందువల్ల ఇది రక్తపోటుతో బాధపడుతున్నవారికి చాలా విలువైన ఆహారం. అరటిపండు, పెద్ద పేగు వ్యాధిగ్రస్తులకు చాలా చక్కని ఆహారం.

- Allmonds:బాదం అలాగే తినాలా..? నానబెట్టి తినాలా..?

- సపోటాతో ఎంత ఆరోగ్యమో... తెలిస్తే అస్సలు వదలరు..!

Next Story
Share it