Top
Batukamma

హ్యాంగోవర్ నుండి ఇలా బయటపడండి

How to overcome hangover
X
Highlights

కొన్ని సులభ పద్ధతుల్లో హ్యాంగోవర్ ను తగ్గించుకోవచ్చు. అవేంటో ఇప్పుడు చూద్దాం.

How to overcome hangover: కొత్త సంవత్సరం వస్తోందంటే రెండు రోజుల ముందు నుంచే ఫుల్లుగా తాగేస్తారు చాలామంది. మందులో మునిగి తేలుతారు. తీరా 31 రాత్రి ముగిసి జనవరి 1లోకి అడుగుపెట్టేసరికి హ్యాంగోవర్ తో తలపట్టేస్తుంది. అప్పటి దాకా చేసిన ఎంజాయ్ మెంట్ మొత్తం ఆవిరైపోతుంది.

హ్యాంగోవర్(hangover) తో అలసట వస్తుంది, తలనొప్పి, అతిగా దాహం వంటి లక్షణాలు కనిపిస్తాయి. కొన్ని సులభ పద్ధతుల్లో హ్యాంగోవర్ ను తగ్గించుకోవచ్చు. అవేంటో ఇప్పుడు చూద్దాం.

హ్యాంగో వర్ పోవాలంటే మస్ట్ గా ఉదయాన్నే లేచి ఖచ్చితంగా టిఫిన్ చేయాలి. ఫుల్ గా తినేయాలి. ఎందుకంటే ఆహారంలో ఉన్న విటమిన్లు, మినరల్స్ హ్యాంగోవర్ నుంచి విముక్తి కలిగిస్తాయి. అలాగే రక్తంలో చక్కెరస్థాయిలను కూడా నియంత్రిస్తుంది.

ఎక్కువగా ఆల్కహాల్ తీసుకున్న వారికి నిద్రలేమి సమస్య ఉంటుంది. అందుకే నిద్ర సరిగా ఉంటే ఈ సమస్య నుండి బయటపడొచ్చు. అందుకే ఉదయాన్నే టిఫిన్ చేశాక గప్ చుప్ గా ముసుగుదన్ని పడుకోవాలి. పడుకోకపోతే అది మరిన్ని సమస్యల్ని తెచ్చి పెడుతుంది.

మందు అతిగా తాగడం వల్ల ఎక్కువగా మూత్రవిసర్జన చేస్తారు. దీనివల్ల డీహైడ్రేషన్ అవుతుంది. శరీరం నిరసంగా మారుతుంది. ఈ సమస్యలు పోవాలంటే ఎక్కువగా నీళ్లు తాగాలి. ఫ్రూట్ జ్యూస్ లు తీసుకోవాలి.

మరో విధానం కషాయం తాగడం. హ్యాంగోవర్ ఉన్నవారు ఉదయాన్నే కషాయం తాగితే.. కాసేపట్లో అంతా సెట్ రైట్ అవుతుంది. ఎందుకంటే కషాయంలో ఆల్కహాల్ ప్రభావాన్ని తగ్గించే మిథనాల్ అనే కెమికల్ ఉంటుంది.

సో.. పై పద్ధతులు పాటించి న్యూ ఇయర్ హ్యాంగోవర్ ని వదిలించుకోండి.

Next Story
Share it