Top
Batukamma

Allmonds:బాదం అలాగే తినాలా..? నానబెట్టి తినాలా..?

benifits of soaked almonds
X
Highlights

వీటిని ఎలా తినాలో చాలామందికి తెలియకపోవడం వల్ల చాలా పోషకాలను కోల్పోతున్నారని అంటున్నారు ఫుడ్ ఎక్స్ పర్ట్స్.

ఆరోగ్యం కోసం డ్రైఫ్రూట్స్, నట్స్ తినడం చాలామందికి అలవాటు. కరోనా తర్వాత వీటి వినియోగం చాలా వరకు పెరిగింది. అయితే.. వీటిని ఎలా తినాలో చాలామందికి తెలియకపోవడం వల్ల చాలా పోషకాలను కోల్పోతున్నారని అంటున్నారు ఫుడ్ ఎక్స్ పర్ట్స్.

ఆల్మండ్(బాదం) విషయానికొస్తే .. ఇందులో చాలా రకాల పోషకాలుంటాయి. శరీరానికి ఇవి చాలా బాగా ఉపయోగపడతాయి. ఏ విధంగా తీసుకున్నా ఇవి ఆరోగ్యానికి మేలు చేసేవే.


ఆల్మండ్స్ లో విటమిన్ ఇ ఉంటుంది. ఫైబర్స్ ఉంటాయి. ఒమెగా 3 ఫాటీ ఆమ్లాలుటాయి. ఒమెగా 6 ఫాటీ ఆమ్లాలు, ప్రొటీన్లు కూడా చాలా వరకు ఉంటాయి. ప్రోటీన్ లు శరీరాన్ని ఉత్తేజంగా ఉంచుతాయి. బాదం తినడం వల్ల ఎముకలు బలపడతాయి. అలాగే అధిక కేలరీలు శరీరంలోకి చేరకుండా చూస్తాయి.

అయితే.. మామూలు బాదంకు, నానబెట్టిన బాదం తినడంలో చాలా తేడాలున్నాయంటున్నారు ఎక్స్ పర్ట్స్. మామూలుగా ఉండే డ్రై బాదం కంటే నానబెట్టిన బాదం తింటే శరీరానికి చాలా మంచిదంటున్నారు.


డ్రై బాదం కంటే నానబెట్టిన బాదం టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అలాగే శరీరానికి పోషకాలు వేగంగా చేరతాయి. బాదంని 6 నుంచి 7 గంటల పాటు నీటిలో నానబెట్టి తింటే మంచిది. బాగా నానిన తర్వాత దాన పైన బ్రౌన్ కలర్ లో ఉండే పొట్టును తీసేసి తినాలి. ఎందుకంటే పైన ఉంటే పొరలో టానిన్ లు ఉంటాయి.

నానబెట్టినవాటి తోలు తీసేసి.. తింటే ఈజీగా జీర్ణం అవుతాయి. బరువు తగ్గాలనుకునే వారికి బాగా ఉపయోగపడుతుంది. ఇది శరీరంలో చెడు కొలెస్టరాల్ ని తగ్గిస్తుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఉంటాయి.


నానబెట్టిన బాదంలో విటమిన్ బీ 17 ఉంటుంది. ఇది కాన్సర్ పేషెంట్లకు చాలా బాగా ఉపయోగపడుతుంది.

అందుకే డ్రై బాదం కంటే.. నానబెట్టిన బాదం తినడమే ఆరోగ్యానికి మంచిదంటున్నారు.

- సింగర్ లిప్సిక లెటెస్ట్ ఫొటోలు

- ఇవాళ కూడా తగ్గిన బంగారం ధర

- ఈ ఏజ్ లోనూ అదరగొడుతున్న ప్రియమణి

Next Story
Share it