Top
Batukamma

సపోటాతో ఎంత ఆరోగ్యమో... తెలిస్తే అస్సలు వదలరు..!

sapota benefits
X
Highlights

ఇవి మన శరీరంలో కలిగించే ఒత్తిడి నుండి విముక్తిని కలిగిస్తాయి. రోజూ ఈ పండ్ల రసాన్ని తీసుకుంటే మానసిక ప్రశాంతత లభిస్తుంది.

Sapota benefits: సపోటను సపోడిల్లా లేక చికూ అని కూడా పిలుస్తారు. విటమిన్ సి వంటి గుణాలకు భాండాగారమైన ఈ పండు అత్యంత రుచికరమైన పండ్లలో మేటి అని చెప్పవచ్చు. మెక్సికోలో ఉద్భవించిన ఈ పండు 19వ దశాబ్దంలో భారతదేశానికి ప్రవేశించి తన అమోఘమైన రుచిని అందరికీ పంచుతోంది.

దేశంలో ఎక్కువగా చికూ అని పిలువబడే ఈ పండు అధికంగా కేరళ రాష్ట్రంలో పండుతుంది. ఆ తరువాత కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో గణనీయంగా లభిస్తుంది. శాస్త్రీయంగా మనిల్కర జపోటగా ప్రసిద్ధి చెందిన ఈ పండులో ఎన్నో లాభసాటి గుణాలు ఉండగా కొన్ని ప్రతికూలాంశాలు కూడా ఉన్నాయి. మరి అవేంటో ఒకసారి చూద్దాం.

సపోటాతో లాభాలు:

1. విటమిన్ 'ఎ' మరియు విటమిన్ సి గుణాలు ఈ పండులో చాలా సమృద్ధిగా ఉంటాయి. కంటి చూపుకి, చర్మ సంరక్షణకు మరియు హృద్రోగ సమస్యల పరిష్కారానికి ఈ పండులోని గుణాలు ఎంతో ఆవశ్యకం, అందుకే వైద్యులు ఈ పండును తినడం మానవద్దని సూచిస్తుంటారు.

2. ఈ పండులో ఉండే తన్నిస్ అనే ప్రత్యేక సమ్మేళనానికి ఉదరంలో తాపాన్ని తగ్గించే గుణాలు ఉంటాయి. అందుకనే గ్యాస్ట్రిక్ మరియు పేగుల సమస్యలు దరిచేరకుండా ఉండేందుకు ఈ పండు ఎంతో మేలు చేస్తుంది.

3. సుక్రోస్ మరియు ఫ్రూక్టోజ్ ఎక్కువగా లభించే ఈ పండును చిన్నపిల్లల ఆరోగ్యానికి మరియు గర్భిణీ స్త్రీలకు ఎక్కువగా సిఫారసు చేస్తుంటారు వైద్యులు.

4. ఆరోగ్య నిపుణుల ప్రకారం ఈ పండులో విటమిన్ బి గుణాలు కూడా అధికంగా ఉంటాయి. ఇవి మన శరీరంలో కలిగించే ఒత్తిడి నుండి విముక్తిని కలిగిస్తాయి. రోజూ ఈ పండ్ల రసాన్ని తీసుకోవడం మూలంగా నరాల ఒత్తిడి తగ్గి మానసిక ప్రశాంతత లభిస్తుంది.

5. ఎముకల దృఢత్వానికి కాల్షియం గుణాలు ఎంతో అవసరం కాగా సపోటలో ఎక్కువగా లభిస్తాయి. అందుకనే రోజుకి కనీసం రెండు సపోటలైనా తినడం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు.

6. అంతేకాకుండా రోజూ సపోట రసం తీసుకోవడం వలన శరీరానికి విటమిన్ సి సమృద్ధిగా చేరి రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఈ గుణాలు ఫ్రీ రాడికల్స్ ను అంతమొందించి అంతర్గత అవయవ వ్యవస్థను మెరుగుపరుస్తాయి.

7. ఈ పండులో ప్రోటీన్ల శాతం ఎక్కువ కాగా శరీర బరువును నియంత్రణలో ఉంచుతూ మధుమేహం మరియు గుండె సంబంధిత సమస్యలతో పోరాడుతుంది.

8. సౌందర్య నిపుణుల ప్రకారం రోజూ సపోట రసం తీసుకుంటే జుట్టు మెత్తబడి చుండ్రు తొలగడమే కాకుండా జుట్టు బలంగా పెరుగుతుంది.

9. ఈ పండులో(sapota benefits) ఉండే విటమిన్ ఎ మరియు విటమిన్ సి గుణాలు సూర్య రష్మి మరియు ఇతర కాలుష్య మాధ్యమాల నుండి చర్మాన్ని సంరక్షిస్తాయి.

10. ఇందులో అధికంగా ఉండే మెగ్నీషియం మరియు ఐరన్ గుణాలు రక్తప్రసరణను నియంత్రిస్తూ రక్తహీనత కలుగకుండా చూస్తాయి.

- దుబ్బాకలో ఎగ్జిట్ పోల్ టెన్షన్.. హరీశ్ రావు పరిస్థితి ఏంటీ..?

- బాప్ రే... ట్రంప్ గెలిస్తే 112 కోట్లు..!

Next Story
Share it