Top
Batukamma

coronavirus Update In Telangana : బయటకు వస్తే ఖతమే.. ఆగస్టు, సెప్టెంబర్ లో భారీ కేసులు!

coronavirus Update In Telangana : బయటకు వస్తే ఖతమే.. ఆగస్టు, సెప్టెంబర్ లో భారీ కేసులు!
X
Highlights

coronavirus Update In Telangana : ఆగస్టు, సెప్టెంబర్ ఈ రెండు నెలల్లో భారీగా కరోనా కేసులు నమోదు అయ్యే ఛాన్స్...

coronavirus Update In Telangana : ఆగస్టు, సెప్టెంబర్ ఈ రెండు నెలల్లో భారీగా కరోనా కేసులు నమోదు అయ్యే ఛాన్స్ ఉందని అన్నారు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్... ప్రజలంతా చాలా అప్రమత్తంగా ఉండాలని, అవసరం అయితే తప్ప బయటకు రాకూడదని అన్నారు.

అటు అసలు 81% మందిలో కరోనా లక్షణాలు లేవని, 14% మందిలో మాత్రమే కరోనా లక్షణాలు కనిపిస్తున్నాయని, 5% మంది పరిస్థితి విషమంగా ఉందని, కేవలం 1% మాత్రమే కరోనాతో పోరాడి చనిపోతున్నారని అన్నారు మంత్రి ఈటెల ..

ఇక తెలంగాణలో ఒక్క జూలైలో కరోనా కేసులు భారీగానే పెరిగాయి. ఈ ఒక్క నెలలోనే రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య ఏకంగా 46 వేలకు చేరుకుంది. ఇక 259 మంది మరణించారు. మార్చి నెలలో కేవలం 97 కరోనా కేసులు మాత్రమే నమోదు అయ్యాయి.. ఆ తర్వాత ప్రభుత్వం టెస్టులు పెంచడంతో ఏప్రిల్ లో 941, మేలో 1659, జూన్ లో 13,641 నమోదు కాగా, ఇక జూలైలో 46 వేల కేసులు నమోదు అయ్యాయి..

ఇక తెలంగాణలో కరోనా కేసుల విషయానికి వచ్చేసరికి గురువారం రోజున రాష్ట్రంలో కొత్తగా 1986 కొత్త కేసులు నమోదు కాగా.. 14 మంది ప్రాణాలు కోల్పోయారు. దీనితో కేసుల సంఖ్య 62,703కి చేరుకుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 16,796 యాక్టివ్ కేసులున్నాయి.

Next Story
Share it