Top
Batukamma

Hemanth murder : వెంటాడి.. వేటాడి.. చేతులు కట్టేసి ప్రాణం తీశారు

Hemanth murder : వెంటాడి.. వేటాడి.. చేతులు కట్టేసి ప్రాణం తీశారు
X
Highlights

అయినా బలవంతంగా కారులో ఎక్కించి.. రింగ్ రోడ్ వైపు తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు.

Hemanth murder in hyderabad : మిర్యాలగూడ అమృత, ప్రణయ్ పరువు హత్య మరిచిపోకముందే.. హైదరాబాద్ లో మరో దారుణం జరిగింది. కూతురి ప్రేమ పెళ్లి ఇష్టంలేని తండ్రి.. కిరాయిహంతకులతో అల్లుడిని హత్య చేయించాడు. పూర్తిగా సినీ ఫక్కీలో జరిగిన ఈ దారుణం ఇప్పుడు రాష్ట్రంలో హాట్ టాపిక్ అయ్యింది.

చందానగర్ కు చెందిన హేమంత్(Hemanth )అదే ప్రాంతానికి చెందిన అవంతిని ప్రేమ పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి తర్వాత వీరిద్దరు గచ్చిబౌలి టీఎన్జీఓ కాలనీలో ఉంటున్నారు. అయితే కూతురి ప్రేమ పెళ్లి.. అమ్మాయి తండ్రికి మొదటి నుండి ఇష్టం లేదు. దీంతో అతడిని ఎలాగైనా హతమార్చాలని అవంతి కుటుంబసభ్యులు ప్లాన్ వేశారు.

హేమంత్(Hemanth )ను చంపేందుకు కిరాయి హంతకులతో ఒప్పందం చేసుకున్నారు. దీనికోసం ప్లాన్ ప్రకారమే అవంతి మేనమామలు, మేనత్తలు, మేనబావలు రంగంలోకి దిగారు. నిన్న మేనమామలు, మేనబావలు అవంతి ఇంటికి వచ్చారు. ఇంటికెళ్దామని మాయమాటలు చెప్పారు.

[embed]https://youtu.be/i5_TTKDt_G4[/embed]

అయినా.. అవంతి అనుమానం వ్యక్తం చేసింది. తమ కారులోనే వస్తామని చెప్పింది. అయినా బలవంతంగా కారులో ఎక్కించి.. రింగ్ రోడ్ వైపు తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు.

అయితే.. కారు తమ ఇంటికి వెళ్లే దారిలో కాకుండా మరో దారిలో వెళ్తుండటంతో అనుమానం వచ్చిన అవంతి, హేమంత్ అందులోంచి దూకేసి పారిపోయే ప్రయత్నంచేశారు. కారులోంచి దూకి కొంత దూరం పరుగెత్తారు. మరో కారులో వీరిని వెంబడిస్తున్న కిరాయి హంతకులు వారిని వెంబడించారు. తప్పించుకునేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. హేమంత్ ను పట్టుకుని కారులో వేసుకుని వెళ్లిపోయారు నిందితులు. ఇందులో బాధితురాలి మేనమామలు కీలక పాత్ర పోషించారని చెబుతోంది.

ఘటన జరిగిన వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చినా.. వారు స్పందించలేదని అవంతి చెబుతోంది. పోలీసులు సకాలంలో స్పందించి ఉంటే తన భర్త బతికే వాడని అంటోంది.

అవంతి ఆందోళనతో స్పందించిన పోలీసులు ఆమె తండ్రిని అదుపులోకి తీసుకున్నారు. సంగారెడ్డి సమీపంలో డెడ్ బాడీని గుర్తించారు.

Next Story
Share it