Top
Batukamma

Hero Srikanth Downfall : టాప్ లో ఉన్న హీరో శ్రీకాంత్ ఒక్కసారిగా ఎందుకు డౌన్ అయ్యాడు?

Hero Srikanth Downfall : టాప్ లో ఉన్న హీరో శ్రీకాంత్ ఒక్కసారిగా ఎందుకు డౌన్ అయ్యాడు?
X
Highlights

Hero Srikanth Downfall : హీరో శ్రీకాంత్.. సినిమాల మీదా ఉన్న పిచ్చితో ఇంట్లో చెప్పకుండా రైలు ఎక్కి చెన్నైకి...

Hero Srikanth Downfall : హీరో శ్రీకాంత్.. సినిమాల మీదా ఉన్న పిచ్చితో ఇంట్లో చెప్పకుండా రైలు ఎక్కి చెన్నైకి వెళ్ళిపోయాడు.. అక్కడ చిన్న చిన్న రోల్స్, విలన్ వేషాలు వేస్తూ అవకాశాలు దక్కించుకున్నాడు.. ఉషాకిరణ్ మూవీస్ నిర్మించిన పీపుల్స్ ఎన్‌కౌంటర్ చిత్రం శ్రీకాంత్ కు నటుడిగా మొదటి సినిమా... ఈ సినిమా 1991లో రిలీజ్ అయింది... కానీ అవకాశాలు మాత్రం రాలేదు.. ఇక సడన్ గా దొంగ రాస్కెల్, ఆమె లాంటి సినిమాలతో హీరోగా మెప్పించాడు..

ఇక రామానాయుడు నిర్మించిన తాజ్ మహల్ సినిమా శ్రీకాంత్ కి మంచి బ్రేక్ ఇచ్చింది.. ఈ సినిమాతో శ్రీకాంత్ హెయిర్ స్టైల్ బాగా ఫేమస్ అయింది.. ఇక రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన పెళ్లి సందడి చిత్రం చిన్న సినిమాగా వచ్చి పెద్ద ప్రభంజనాన్ని సృష్టించింది.. ఈ సినిమాతో శ్రీకాంత్ కి స్టార్ ఇమేజ్ ని తెచ్చిపెట్టింది.. అంతేకాకుండా అభిమాన సంఘాలు కూడా ఏర్పడ్డాయి..

ఇక వినోదం, తాళి, ఎగిరే పావురమా, ప్రేయసి రావే, మా నాన్నకి పెళ్లి, పంచదార చిలుక ఇలా రెండు సంవత్సరాల వ్యవధిలోనే శ్రీకాంత్ పది సినిమాలను చేశాడు... అన్ని సూపర్ హిట్స్ అయిపోయాయి.. దీనితో శ్రీకాంత్ మార్కెట్ అమాంతం పెరిగిపోయింది.. వరుస సినిమాలతో శ్రీకాంత్ బిజీ అయిపోయాడు.. అంతేకాకుండా శ్రీకాంత్ అంటే మినిమం గ్యారెంటీ హీరో అనే ముద్ర పడిపోయింది.

యాక్షన్, కామెడీ, ఎమోషన్ ఇలా అన్ని అవలీలంగా పండించగలడు శ్రీకాంత్.. ఇలా సంవత్సరానికి 10 సినిమాలు చేసుకుంటూ పోయిన శ్రీకాంత్ అతి తక్కు వ టైంలో వంద సినిమాలు చేశాడు.. అయితే ఇంతటి బిజీగా ఉన్న శ్రీకాంత్ కెరీర్ ఒక్కసారిగా ఎందుకు డౌన్ అయింది. శ్రీకాంత్ చేసిన మిస్టేక్స్ ఏంటి?

కమిట్మెంట్స్ ఇచ్చేయడం!

శ్రీకాంత్ కెరీర్ పీక్స్ లో ఉన్న సమయంలో అంటే 1998, 99 మధ్యలో శ్రీకాంత్ ఏకంగా నాలుగు సంవత్సరాలకి గాను సినిమాలకి అడ్వాన్స్ తీసుకొని కమిట్మెంట్స్ ఇచ్చేశాడు.. ఇందులో కొన్ని మంచి సినిమాలు ఉండగా, మరికొన్ని సినిమాలు దారుణంగా ప్లాప్ అయ్యాయి.. ఇవే శ్రీకాంత్ కెరీర్ ని కింద పడేశాయి..

మాస్ ఇమేజ్ కోసం ట్రై చేయడం..

శ్రీకాంత్ కు ఉంది లవర్ బాయ్ ఇమేజ్.. శ్రీకాంత్ అంటే ఫ్యామిలీ ఆడియన్స్ పడి చచ్చిపోతారు.. అలా కెరీర్ సాఫీగా సాగిపోతున్న సమయంలో నిధి, ఇంగ్లీష్ పెళ్ళాం ఈస్ట్ గోదావరి మొగుడు లాంటి మాస్ ఇమేజ్ కథలను ఎంచుకోవడం శ్రీకాంత్ కెరీర్ కి బాగా మైనస్ అయింది..

మల్టీ స్టారర్ మూవీస్ చేయడం..

కెరీర్ పీక్స్ లో ఉన్న సమయంలో తనకి పోటిగా ఉన్న హీరోలు జగపతిబాబు, వడ్డే నవీన్, జేడీ చక్రవర్తి లాంటి హీరోలతో మల్టీ స్టారర్ మూవీస్ చేయడం శ్రీకాంత్ కి మరో మైనస్ గా మారింది. మల్టీ స్టారర్ మూవీస్ అంటే శ్రీకాంత్ ఓ హీరో అని అందరికి రిజిస్టర్ అయిపొయింది.

వారుసుల ఎంట్రీ..

ఎలాంటి బ్యాక్ రౌండ్ లేకుండా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు శ్రీకాంత్.. కెరీర్ పీక్స్ లో ఉన్న సమయంలో వారుసుల ఎంట్రీ కూడా శ్రీకాంత్ కి ఓ మేరకు దెబ్బ తీసింది అనే చెప్పాలి.. పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ఎన్టీఆర్ లాంటి నటులు హవా ముందు శ్రీకాంత్ నిలదోక్కోకోలేకపోయాడనే చెప్పాలి.. దీనికితోడు సినిమా అవకాశాలు తగ్గడం, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా శ్రీకాంత్ సినిమాలు చేసుకుంటూ పోవడం హీరోగా శ్రీకాంత్ ఫెడ్ అవుట్ అయిపోయాడు.

Next Story
Share it