Top
Batukamma

Highcourt Warning To Telangana Government : అంతా మీ ఇష్టమేనా..?

Highcourt Warning To Telangana Government : అంతా మీ ఇష్టమేనా..?
X
Highlights

Highcourt Warning To Telangana Government : తెలంగాణ సర్కారుకు వీ6- వెలుగు చుక్కలు చూపిస్తోంది. మీడియాపై...

Highcourt Warning To Telangana Government : తెలంగాణ సర్కారుకు వీ6- వెలుగు చుక్కలు చూపిస్తోంది. మీడియాపై నియంత్రణ విషయంలో సర్కారుపై కోర్టుకెక్కింది వీ6. సెక్రటేరియట్ కూల్చివేతలకు సంబంధించి మీడియా కవరేజీకి అనుమతించకపోవడంపై హైకోర్టులో పిటిషన్ వేసింది.

రెండు రోజులుగా ఈ పిటిషన్ పై హైకోర్టులో వాదనలు జరుగుతున్నాయి. అయితే.. వాదనలు మొదలైనప్పటి నుంచి సర్కారుకు పంచ్ లు ఇస్తూనే ఇంది హైకోర్టు.

ఇంత సీక్రెట్ గా సెక్రటేరియట్ బిల్డింగ్ కూల్చివేయాల్సిన అవసరం ఏంటని సర్కారును ప్రశ్నించింది హైకోర్టు. అయితే అక్కడ ఏదైనా ప్రమాదం జరిగితే ఇబ్బందికరమని కోర్టుకు చెప్పింది సర్కారు. కూల్చివేతల దగ్గరకు ఎవరినీ అనుమతించలేమని కోర్టుకు వివరించింది.

telangana secretariat demolition 1

మీడియాను అనుమతించేది లేదని తెగేసి చెప్పడంతో.. ఎందుకు అనుమతించరో కూడా చెప్పాలని ప్రభుత్వ తరుపు న్యాయవాదిని కోర్టు ప్రశ్నించింది.

కూల్చివేతలకు సంబంధించి రోజువారీ వివరాలు మీడియాకు ఇవ్వొచ్చుకదా అని సర్కారును అడిగింది కోర్టు. కొవిడ్ మాదిరిగా బులిటెన్లు ఇవ్వొచ్చు కదా అని ప్రశ్నించింది. అయితే ఇప్పటికే 95 శాతం పనులు పూర్తయ్యాయని అడ్వకేట్ జనరల్ కోర్టుకు తెలిపారు.

బులిటెన్ విడుదలపై సర్కారును అడిగి సోమవారం లోపు చెబుతానని అడ్వకేట్ జనరల్ కోర్టుకు తెలిపారు. అయితే.. అంత సమయం ఇచ్చేది లేదని.. శుక్రవారం లోపు విషయం చెప్పకుంటే.. తామే ఓ నిర్ణయం తీసుకుంటామని హెచ్చరించింది కోర్టు.

telangana secretariat demolition

సెక్రటేరియట్ పాత భవనాలను చాలా భద్రత మధ్య కూలుస్తోంది ప్రభుత్వం. సెక్రటేరియట్ పరిసర ప్రాంతాల్లో ఆంక్షలు కూడా పెట్టారు. మీడియాను కాదు కదా.. అటువైపు ఇళ్లున్న సామాన్య జనాన్ని కూడా ఆ మార్గంలో అనుమతించడం లేదు.

అయితే.. సెక్రటేరియట్ పాత భవనంలోని సొరంగమార్గంలో గుప్తనిధులున్నాయని.. వాటిని దోచేసేందుకే సీక్రెట్ గా భవనాలు కూల్చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. దీంతో ఇప్పుడు వీ6 పిటిషన్ తో హైకోర్టు సీరియస్ అవ్వడం మరింత ఆసక్తిగా మారింది.

Next Story
Share it