Top
Batukamma

Ice Cream Eating Conditions : అమ్మాయిలు ఐస్ క్రీం నాకుతూ తినొద్దట..!

Ice Cream Eating Conditions : అమ్మాయిలు ఐస్ క్రీం నాకుతూ తినొద్దట..!
X
Highlights

Ice Cream Eating Conditions : సాధారణంగా పొరుగు వారితో ఎలా ఉండాలనే దానిపై తల్లిదండ్రులు.. పిల్లలకు సూచనలు...

Ice Cream Eating Conditions : సాధారణంగా పొరుగు వారితో ఎలా ఉండాలనే దానిపై తల్లిదండ్రులు.. పిల్లలకు సూచనలు చేస్తూ ఉంటారు. ఇలా ఉండాలి..? ఇలా మాట్లాడాలి..? బయటకు వెళ్లినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..? అనే విషయాలు రెగ్యులర్ గా చెబుతుంటారు.

టర్కీలో మాత్రం దీనిపై ఓ స్పెషల్ కోర్స్ స్టార్ట్ చేశారు. అయితే.. ఇది అందరి కోసం కాదు. కేవలం అమ్మాయిల కోసమే. అమ్మాయిలు ఎలా ఉండాలనేదానిపై ఇక్కడ ట్రైనింగ్ ఇస్తున్నారు.

పొరుగు వారితో ఎలా మాట్లాడాలి.? ఎలా మాట్లాడాలి..? ఇలాంటి అంశాలపై ట్రైనింగ్ ఇస్తున్నారు.

అంతేకాదు... తినే దగ్గర్నుంచి.. బయటకు వెళితే ఎలా ఉండాలన్న దాని వరకు అన్ని అంశాలపై శిక్షణ ఇస్తున్నారు. ఫుడ్ తిసుకునేటప్పుడు ఎక్కువగా మాట్లాడొద్దు. మార్నింగ్ టైంలో ఎక్కువగా మేకప్ వేసుకోవద్దు.

turkey ice cream

పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ వాహనాల్లో వెళుతున్నప్పుడు సరిగ్గా కూర్చోవాలి. అసభ్యకరపదాలు పలకొద్దు. అంతేకాదు.. బ్రో అనే పదం కూడా వాడొద్దని రిస్టిక్షన్స్ పెడుతున్నారు.

అయితే.. వీటన్నింటిపై పెద్దగా అభ్యంతరాలు రాలేదు గానీ.. ఐస్ క్రీం తినే విషయంలో పెట్టిన కండీషనే ఇప్పుడు ఇస్తాంబుల్ లో కాంట్రవర్సీ అయ్యింది. అమ్మాయిలు ఐస్ క్రీంను నాకుతూ తినొద్దని నిబంధన పెట్టారు. ట్రైనింగ్ సెంటర్లలోనూ ఇదే విషయం చెబుతున్నారు.

అయితే.. నాకుతూ తినొద్దని చెప్పారు సరే.. మరి ఎలా తినాలో కూడా చెప్పాలంటూ ప్రశ్నిస్తున్నారు ఇస్తాంబుల్ అమ్మాయిలు. అసలు ఎందుకు ఇలాంటి నిబంధన పెట్టారు అర్థం కావడం లేదంటున్నారు.

turkey ice cream

దీనిపై టర్కీ సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి. కొందరు మాత్రం తాము ఐస్ క్రీంను కొరుక్కుని తింటున్నామని చెబుతున్నారు.

Next Story
Share it