Top
Batukamma

దోస్త్.. దోస్త్.. అంటూనే గట్టిగానే దెబ్బేశాడుగా..!

దోస్త్.. దోస్త్.. అంటూనే గట్టిగానే దెబ్బేశాడుగా..!
X
Highlights

భారత్ కు సహకరిస్తున్నాడనుకున్న ట్రంప్.. హ్యాండిచ్చాడు. మోడీ నాకు ఫ్రెండ్ అంటూనే.. కలిసి నడుద్దామని చెబుతూనే...

భారత్ కు సహకరిస్తున్నాడనుకున్న ట్రంప్.. హ్యాండిచ్చాడు. మోడీ నాకు ఫ్రెండ్ అంటూనే.. కలిసి నడుద్దామని చెబుతూనే ఇప్పుడు దిమ్మదిరిగే షాకిచ్చాడు. ఇండియన్ టెకీలకు హెడెక్ తెచ్చి పెట్టాడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్.

డాలర్ డ్రీమ్స్ పెట్టుకున్న టెకీలంతా.. హెచ్1బీ వీసాల రూల్స్ లో మార్పులతో ఇప్పుడు నైరాశ్యంలో మునిగిపోయారు.

అమెరికా జాతీయులకు ఉద్యోగ అవకాశాలు పెట్టాలన్న ఉద్దేశంతోనే ఈ నిబంధన తెచ్చినట్టు చెబుతోంది ట్రంప్ సర్కారు.

ఇందులోనూ చాలా తెలివిగా కండీషన్లు పెట్టింది అమెరికా సర్కారు. అమెరికన్ వర్కర్ల కంటే హెచ్1బీ వీసాతో వచ్చే వారికి ఎక్కువ శాలరీ ఇవ్వాలని చెబుతోంది. ఇది సాధ్యమయ్యే పని కాదు.

ఎక్కువ జీతం ఇచ్చి మరీ ఉద్యోగులను తీసుకోవడానికి ఏ కంపెనీ ఇష్టపడదు. తమ దేశంలో తక్కువ శాలరీతో పని చేసే నిపుణులు దొరికినప్పుడు ఇతర దేశాల నుంచి వచ్చే వారికి సకల సౌకర్యాలు కల్పించి ఎక్కువ జీతాలు ఇచ్చేందుకు ఏ కంపెనీ ముందుకు రాదు.

ఈ ఒక్క నిర్ణయంతో డాలర్ డ్రీమ్స్ పెట్టుకున్న చాలామంది టెక్కీలకు మైండ్ బ్లాంక్ అయ్యింది. ఇవే కాదు.. థర్డ్ పార్టీ క్లయింట్ సైట్లలో ఉద్యోగులు మూడేళ్లు ఉండేందుకు ఇప్పటి వరకు అవకాశం ఉంది. దీనిని ఏడాదికి తగ్గించారు. ఇది కూడా టెకీలకు పెద్ద దెబ్బే.

అయితే.. ఇప్పటికే గ్రీన్ కార్డు పొంది అమెరికాలో సెటిలైన వారి ఉద్యోగాలకు ఎలాంటి ఇబ్బంది లేదనే చెప్పుకోవాలి. కానీ కొత్తగా అమెరికా వెళ్లి డాలర్లు సంపాదించి.. అక్కడే సెటిలైపోదామని కోటి ఆశలు పెట్టుకున్న వారు మాత్రం.. ఇప్పుడు ఆ ఆశలను పక్కనపెట్టక తప్పని పరిస్థితి వచ్చింది.

Also Read :

Next Story
Share it