Top
Batukamma

ఆ ఒక్క మిస్టేక్ చెన్నకేశవరెడ్డి సినిమాని ఇండస్ట్రీ హిట్ గా నిలబెట్టలేకపోయింది!

ఆ ఒక్క మిస్టేక్ చెన్నకేశవరెడ్డి సినిమాని ఇండస్ట్రీ హిట్ గా నిలబెట్టలేకపోయింది!
X
Highlights

సమరసింహారెడ్డి సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో పూర్తిగా యాక్షన్ సినిమాలకి తెరలేపారు నటసింహం నందమూరి...

సమరసింహారెడ్డి సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో పూర్తిగా యాక్షన్ సినిమాలకి తెరలేపారు నటసింహం నందమూరి బాలకృష్ణ... ఆ తర్వాత నరసింహనాయుడు వంటి ఇండస్ట్రీ హిట్ , సిమసింహం లాంటి యావరేజ్ మూవీని ఇచ్చారు.. ఈ సినిమాల తరవాత వి.సముద్ర డైరెక్షన్ లో ఓ సినిమాని ప్లాన్ చేశారు బాలయ్య.. ఈ సినిమా 2002 మార్చిలో పూజా కార్యక్రమాలతో మొదలై రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలైంది..

అయితే మళ్లీ ఫ్యాక్షన్ మూవీనే చేయాలని సముద్ర మూవీని పక్కనపెట్టేసి బీ.గోపాల్ తో నందీశ్వరుడు పేరుతో ఓ సినిమాని మొదలు పెట్టారు బాలకృష్ణ.. అప్పుడే బీ.గోపాల్ ఇంద్ర సినిమాని కంప్లీట్ చేసి ఉన్నారు.. అయితే అప్పటికే ఎన్టీఆర్ తో ఆది లాంటి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన వినాయక్ బాలయ్యకి తీహార్ జైల్లో చెన్నకేశవరెడ్డి ఎంట్రీ, ఆయన ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్, పులివెందులలో జరిగే కొన్ని యాక్షన్ ఎపిసోడ్స్ ఇలా కొన్ని చెప్పుకొచ్చాడు.. వీటికి ఇంప్రెస్ అయిన బాలయ్య వినాయక్ కి పరుచూరి బ్రదర్స్ ని ఇచ్చి కథను డెవలప్ చేయమని చెప్పారు.. దీనితో బీ గోపాల్ మూవీని పక్కన పెట్టేసి వినాయక్ మూవీని మొదలు పెట్టాడు బాలకృష్ణ..

Balakrishna Good-Looking Scene || Latest Movie Scenes || TFC Movies Adda - YouTube

వినాయక్ సీన్స్ రాయగా, పరుచూరి పవర్ఫుల్ డైలాగ్స్ అందించారు.. బాలయ్య డ్యూయల్ రోల్.. అప్పుడే ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన శ్రియను ఒక హీరోయిన్ గా తీసుకోగా, మరో పాత్రకి సౌందర్య అనుకున్నారు.. కానీ ఆమె డేట్స్ ఖాళీగా లేకపోవడంతో టబును తీసుకున్నారు.. ఇక షూటింగ్ మొదలై చక చక సీన్స్ ని తెరకెక్కిస్తున్నాడు వినాయక్.. యాక్షన్ ఎపిసోడ్స్ ని చాలా జాగ్రత్తగా తెరకెక్కిస్తున్నారు.. దీనితో అనుకున్న రోజుల కంటే షూటింగ్ ఎక్కువరోజులు టైమ్ తీసుకుంటుంది.. దీనికి తోడు అప్పుడే రిలీజ్ అయిన ఇంద్ర మూవీ భారీ హిట్ దిశగా వెళ్తుంది. దీనితో చెన్నకేశవరెడ్డి సినిమాపైన ఒత్తిడి బాగా పెరిగింది..

ఓ సాంగ్, కొన్ని సన్నివేశాలు లేకుండానే చెన్నకేశవరెడ్డి సినిమాని కంప్లీట్ చేశాడు వినాయక్.. దీనితో సినిమాని సెప్టెంబర్ 25 2002 లో రిలీజ్ చేశారు.. మూడు సంవత్సరాల వ్యవధిలో రెండు ఇండస్ట్రీ హిట్స్ కొట్టిన బాలయ్య నుంచి వస్తున్న మరో ఫ్యాక్షన్ మూవీ కావడంతో అంచనాలు భారీగా పెరిగాయి.. అయితే ఉహించినంతగా సినిమా లేనప్పటికీ చెన్నకేశవరెడ్డి పాత్ర బాలయ్య ఫ్యాన్స్ కి బాగా కిక్కు ఇచ్చింది.. తీహార్ జైల్లో ఆయన ఎంట్రీ, పులివెందులలో ఆయన సీన్స్, విలన్స్ తో చెప్పే డైలాగ్స్, మణిశర్మ నేపధ్య సంగీతం ఫ్యాన్స్ ని సీట్లో కూర్చొనివ్వవు.. సినిమా మొత్తంలో ఈ ఒక్క పాత్రకి మనం కొన్న ఆ టికెట్ సాటిస్ఫై చేస్తుంది.

హీరోయిన్లు శ్రియ, టబు ఆకట్టుకోగా దేవయాని పాత్ర బాగా క్లిక్ అయింది.. ఆమె కనిపించే కొన్ని సీన్స్ విజిల్స్ వెయిస్తాయి.. ఇక మణిశర్మ పాటలు ఒకేగా ఉన్న నేపధ్య సంగీతంతో సినిమా లెవల్ ని పెంచాడు.. షేరబా షేరబా అంటూ వచ్చే మ్యూజిక్ కి పునకాలు వస్తాయి.. బెల్లంకొండ సురేష్ బాబు నిర్మాణ విలువలు సినిమా స్థాయుని పెంచాయి.. రిజల్ట్ సంగతి పక్కన పెడితే బాలయ్య ఫ్యాన్స్ ని ఫుల్ గా సాటిస్ఫై చేసింది ఈ సినిమా.. వినాయక్ కి ఇంకొంచం టైం ఇస్తే తప్పకుండా ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ అయ్యేది.. అప్పటికి బెస్ట్ రిజల్ట్ ఇచ్చాడు వినాయక్.. ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలో బెస్ట్ మూవీ వర్క్ ఇదే అని అంటారు వినాయక్..

Chennakesava Reddy (Telugu Movie) Reviews, Ratings, Trailer - Justdial

తొమ్మిది కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా 140 కేంద్రాల్లో 50 రోజులు..42 సెంటర్లలో 100 రోజులు ఆడింది. మొత్తం ఈ సినిమా 14 కోట్లను కొల్లగొట్టి హిట్ గా నిలిచింది. కానీ అప్పటికి బాలయ్య రేంజ్ 20 కోట్లు.. ఈ సినిమా రిలీజ్ తరువాత తెలుపు తెలుపు అనే పాటను తెరకెక్కించి మళ్లీ సినిమాల్లో యాడ్ చేశారు.. అయితే ఈ పాట షూట్ చేస్తున్న టైంలో వినాయక్ చాలా నిరాశతో ఉండడంతో బాలయ్య వినాయక్ ని పక్కకి పిలిచి సినిమా రిలీజ్ట్ మన చేతిలో ఉండదు.. మనం చేయాల్సింది చేశాం..నీ వర్క్ బాగుంది.. మళ్లీ ఓ సినిమా చేద్దాం అన్నారట వినాయక్ తో.. అది బాలయ్య అంటే..

https://youtu.be/ExtOL9Tg_Is

Next Story
Share it