Top
Batukamma

Gold : బంగారం ఇప్పుడు కొనొచ్చా..? లేదా..?

Gold : బంగారం ఇప్పుడు కొనొచ్చా..? లేదా..?
X
Highlights

Gold : బంగారం ప్రియులకు కొన్ని రోజులుగా ప్రతీరోజు బ్యాడ్ న్యూస్ వస్తోంది. రోజు రోజుకు బంగారం ధర పెరుగుతూ...

Gold : బంగారం ప్రియులకు కొన్ని రోజులుగా ప్రతీరోజు బ్యాడ్ న్యూస్ వస్తోంది. రోజు రోజుకు బంగారం ధర పెరుగుతూ పోయింది. ఇప్పుడు పండగల సీజన్ వచ్చేస్తోంది. చాలామంది బంగారం కొనేందుకు ప్లాన్ చేస్తున్నారు. కానీ పెరుగుతున్న ధరలు చూస్తే మాత్రం చుక్కలు కనిపిస్తున్నాయి. ఎప్పుడు పెరుగుతుందో..? ఎప్పుడు తగ్గుతుందో..? తెలియని పరిస్థితి ఏర్పడింది.

గత నెలలో బంగారం ధర ఆల్ టైం హైకి చేరింది. ఆగస్ట్ 7న 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.59,130కు పెరిగింది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.54,200 స్థాయికి పెరిగింది. ఇప్పుడు మాత్రం బంగారం కాస్త ఆశాజనకంగా కనిపిస్తోంది. ప్రస్తుతం ధరలు భారీగా దిగొచ్చాయి. ప్రస్తుతం 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.53,850 కి చేరింది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.49,370 కు చేరింది. అంటే గత నెలతో పోలిస్తే పసిడి ధర రూ.5 వేలకు పైగా పడిపోయింది.

బంగారం బాటలోనే వెండి కూడా నడుస్తోంది. వెండి ధరలు భారీగా పడిపోయాయి. కిలో వెండి ధర ప్రస్తుతం రూ.68,500 వద్ద ఉంది. ఆగస్ట్ 7న కేజీ వెండి ధర రూ.76,510కు పెరిగింది. అంటే అప్పటితో పోలిస్తే వెండి ధర ధర ఇప్పుడు 8 వేలకు పైగా పడిపోయింది. గత నెలతో పోలిస్తే ప్రస్తుతం బంగారం వెండి ధరలు కాస్త తగ్గాయి. ఇలాంటి పరిస్థితుల్లో బంగారం, వెండి కొనొచ్చా..? లేదా..? ధర తగ్గింది కదా అని కొంటే తర్వాత పెరుగుతుందా..? లేకపోతే మరింత తగ్గపోతుందా..?

అయితే.. బంగారం ధర రాబోయే రోజుల్లో మరింత పెరిగే ఛాన్స్ ఉందంటున్నారు. మరో రెండు మూడు నెలల్లో 10 గ్రాముల బంగారం ధర 56 వేలు దాటిపోయే అవకాశముందంటున్నారు. USA ఆర్థిక వ్యవస్థపై కరోనా ప్రభావం.. వడ్డీరేట్లు తక్కువగా ఉండటం.. ట్రంప్ చైనా వ్యతిరేక నిర్ణయాల కారణంగా ధరలు పెరుగుతున్నాయని చెబుతున్నారు.

Next Story
Share it